Cash Show – Alitho Saradaga : క్యాష్‌, అలీతో సరదాగా రెండు ఆగిపోతే ఈటీవీ పరిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cash Show – Alitho Saradaga : క్యాష్‌, అలీతో సరదాగా రెండు ఆగిపోతే ఈటీవీ పరిస్థితి ఏంటి?

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2022,7:20 pm

Cash Show – Alitho Saradaga : ఒకప్పుడు ఈటీవీ అంటే తెలుగు ప్రేక్షకుల ఛానల్.. అత్యంత ఆదరణ దక్కించుకున్న ఛానల్.. కానీ ఇప్పుడు మూడు నాలుగు షో లు మాత్రమే ఈటీవీ నిలబెడుతూ వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఉండవు.. ఆసక్తికర సీరియల్స్ ఉండవు.. అలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే గేమ్ షోలు కూడా ఇందులో ఉండవు. కనుక ఈటీవీని చూడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటున్నారు. ఒక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డ్యాన్సు షో, ఆలీతో సరదాగా,

సుమ క్యాష్ కార్యక్రమాలు మినహా ఏ ఇతర సీరియల్స్ మరియు షో లు ఈటీవీ ని కాపాడలేక పోతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో ల్లో కూడా కొన్ని ఆగి పోబోతున్నాయి. ఇప్పటికే ఆలీతో సరదాగా కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను అన్నట్లుగా అలీ పేర్కొన్నాడు. ఇక సుమ కొత్త సంవత్సరం క్యాష్ కార్యక్రమం తర్వాత తన క్యాష్ కార్యక్రమం ఉండదని తేల్చి చెప్పింది. తాను బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాను అన్నట్లుగా తాజా ఎపిసోడ్ లో ఆమె పేర్కొనడం అందరికీ ఒకింత ఆందోళన కలిగిస్తుంది.

suma cash and Alitho Saradaga shows going to stop in etv

suma cash and Alitho Saradaga shows going to stop in etv

ఈ రెండు షో లు కూడా వారంలో ఈటీవీ యొక్క రేటింగ్ పెరగడంలో మంచి పాత్ర వహిస్తాయి. అలాంటి రెండు ఎపిసోడ్స్ కూడా లేకపోతే కచ్చితంగా ఈటీవీ మరింత డ్యామేజీని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లు మాత్రమే ఈటీవీని నెట్టుకు రావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పోటీకి ఆ రెండు కార్యక్రమాలతో నిలవాలి అంటే కచ్చితంగా అసాధ్యం. అందుకే ఈటీవీ మళ్లీ ఆ కార్యక్రమాలను ప్రారంభిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది