Anchor Suma : పానీపూరి బండి వద్ద క్రేజ్.. యాంకర్ సుమ
సుమ దగ్గరుండి మరీ తన సినిమాను ప్రమోట్ చేసేసుకుంటోంది. అంతా తానై సినిమాను ముందుండి నడిపస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పెద్ద హీరోలందరినీ ఇన్వాల్వ్ చేసేస్తోంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి వారితో సినిమాను ప్రమోట్ చేయించేస్తోంది సుమ.అలా మొత్తానికి సుమ మాత్రం వెండితెరపై మళ్లీ వెలిగేందుకు ట్రై చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో సుమ మాత్రం తన సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసుకుంటోంది.

Anchor Suma At PaniPuri And fans Takes Selfie
తాజాగా 70 ప్లస్ వారితో కలిసి సుమమ్మ పంచాయితీ అని పెట్టేసింది. అది బాగానే వర్కవుట్ అయింది. తాజాగా సుమ పానీ పూరి బండి వద్ద వెయిట్ చేస్తోంది. ఈ మేరకు ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టేసింది.పానీ పూరి తినేందుకు సుమ వస్తే.. అక్కడ కూడా సెల్ఫీలంటూ రచ్చ చేశారు. అయితే పానీ పూరి కోసం సుమ సైతం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంతలో ఇలా అభిమానులు సుమతో సందడి చేశారు.