Sunitha Ram : సునీత్ రామ్ కథ అప్పుడే మొదలైందట.. క్యూట్ లవ్ స్టోరీ!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: February 24, 2021, 11:44 am

Sunitha Ram :  సింగర్ సునీత రెండో పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా చర్చకు వచ్చిందో అందరికీ తెలిసిందే. రెండో పెళ్లి అంటూ ఎన్నో యేళ్లుగా రూమర్లు వచ్చాయి. నిశ్చితార్థం అంటూ వార్తలు రావడం, కొన్ని ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో సునీత స్వయంగా అసలు విషయాన్ని చెప్పేసింది. తాను రెండో పెళ్లికి సిద్దమయ్యానని తన రామ్ వీరపనేని గురించి మొదటిసారిగా అందరికీ చెప్పేసింది. అయితే సునీత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో భిన్నరకాల చర్చలు జరిగాయి.

Sunitha Ram Veerapaneni In 100 Percent love show

Sunitha Ram Veerapaneni In 100 Percent love show

Sunitha Ram : సునీత్ రామ్ కథ అప్పుడే మొదలైందట..

అవన్నీ పక్కన పెడితే.. రామ్ సునీత ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సుమ చేసిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు. కానీ తాజాగా ఆదివారం ప్రసారమైన 100 పర్సెంట్ లవ్ షోలో సునీత, రామ్‌లు స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. అక్కడ తన ప్రేమ గురించి, సునీతతో పరిచయం గురించి అన్న విషయాలు చెప్పేశాడు. 1995 నుంచి సునీతతో పరిచయం ఉందని, ఆమె సోషల్ మీడియా ఖాతాలను హ్యాండిల్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు.

నన్ను బాగా చూసుకో.. మిగతావన్నీ నేను బాగా చూసుకుంటాను అని రామ్ సునీతతో చెప్పుకొచ్చాడు. అలా అన్నేళ్ల స్నేహం కాస్త లాక్డౌల్‌లో వివాహా బంధంగా మారింది. పెళ్లి తరువాత సునీత చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పెళ్లి తరువాత జీవితం ఎంత హ్యాపీగా ఉందో చెప్పకనే చెబుతోంది. మొత్తానికి ఇలా ఓ షోలో రామ్ తన ప్రేమ కథ గురించి చెప్పేశాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp