Superstar Krishna : ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు కూడా సాధ్యం కాని రికార్డులు సృష్టించి ట్రెండ్ సెట్ చేసిన కృష్ణ.. అవేంటో తెలుసా?
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్తంభం లాంటి వారు కృష్ణ. ఆయన ఒక నటుడిగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాదు.. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. అసలు.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఎక్కడో హాలీవుడ్ లో మాత్రమే మనకు జేమ్స్ బాండ్ లాంటి హీరో కనిపిస్తారు.
కానీ.. తెలుగు ప్రేక్షకులకు జేమ్స్ బాండ్ హీరోను, కౌబాయ్ ని పరిచయం చేసింది కృష్ణనే. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతగా టెక్నాలజీ పరంగా ముందు వరుసలో లేని సమయంలో.. టెక్నికల్ గా తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకుపోయారు సూపర్ స్టార్. అలా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణకు మాత్రమే సాధ్యమైన రికార్డులు చాలా ఉన్నాయి. కృష్ణను ఎవరు చూసినా కూడా ప్రయోగాల హీరో లేదా సాహసాల హీరో అని అంటారు. దానికి కారణం.. ఆయన ఎంచుకున్న సినిమాలు.. ఆయన చేసిన సినిమాలు. కృష్ణ నటించిన తొలి మూవీ తేనెమనసులు.. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సోషల్ మూవీ.
Superstar Krishna : సాహసాల, ప్రయోగాల నటుడు అని కృష్ణకు ఎందుకు పేరొచ్చిందంటే?
అలాగే.. గూఢచారి 116 సినిమా కృష్ణ నటించిన తొలి జేమ్స్ బాండ్ మూవీ. మోసగాళ్లకు మోసగాళ్లు మూవీ తొలి కౌబాయ్ మూవీ. అలాగే.. ఫస్ట్ తెలుగు సినిమా స్కోప్ ఉన్న మూవీ అల్లూరి సీతారామరాజు. దొంగల దోపిడి సినిమా తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ ఉన్న మూవీ. తెలుగు వీర లేవరా అనే పాటుకు తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న మూవీ అల్లూరి సీతారామరాజు. మోసగాళ్లకు మోసగాడు సినిమాతో తొలి సారి పాన్ వరల్డ్ మూవీని చేసిన తెలుగు హీరోగా కృష్ణ మరో రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా హాలీవుడ్ లో కూడా విడుదలైంది. అక్కడ విడుదలైన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.