Superstar Krishna : కాంగ్రెస్ తో కృష్ణకు ఎక్కువ అనుబంధం.. ఎంపీగా గెలిచి రాజకీయాల్లో రాణించిన కృష్ణ
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. రాజకీయాల్లో ఆయన 1972 లో చేరారు. జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ.. 1984 లో కృష్ణ… రాజీవ్ గాంధీ ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో తన సినిమాలు కూడా రాజకీయాలకు దగ్గరగా ఉండేవి. 1989 లో ఏలూరులో లోక్ సభ నియోజకవర్గం.
నుంచి పోటీ చేసిన కృష్ణ కాంగ్రెస్ నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991 లో వచ్చిన ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ ను కృష్ణ ఆశించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో పార్టీ ఆయనకు మళ్లీ ఏలూరు నుంచే టికెట్ ఇచ్చింది. కానీ.. 1991 ఎన్నికల్లో కృష్ణ ఏలూరు నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత 1991 లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి కృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Superstar Krishna : వైఎస్సార్ కు 2009 ఎన్నికల్లో మద్దతు పలికిన కృష్ణ
ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణ దూరం అయినప్పటికీ.. 2009 ఎన్నికల్లో మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు, కాంగ్రెస్ పార్టీకి కృష్ణ, ఆయన కుటంబ సభ్యులు మద్దతు పలికారు. అలా సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది. కృష్ణ.. ఇవాళ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఆయన ప్రస్తుత వయసు 80 ఏళ్లు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస ఇబ్బందులతో పాటు ఆయన ఇంటర్నల్ ఆర్గాన్స్ పనిచేయడం ఆగిపోవడంతో కృష్ణ తుదిశ్వాస విడిచారు.