Superstar Krishna : బుర్రిపాలెం బుల్లోడు.. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల వైపు అడుగులు పడిందిలా..!
Superstar Krishna : తెలుగు సినీ పరిశ్రమని శోక సముద్రలో పడేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు. అంతేకాదు తెలుగు సినిమాకు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి. సినిమా సినిమాకు ఆయన క్రేజ్ పెంచుకుంటూ తేనెమనసులు నుంచి సూపర్ స్టార్ గా ఎదిగారు కృష్ణ. 1943 మే 31న ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు కృష్ణ జన్మించారు.
నర్సాపురంలో డిగ్రీ పూర్తి చేసి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మద్రాస్ వెళ్లారు. ఆ టైం లో ఎన్.టి.ఆర్ అంటే ఇష్టం ఉన్న కృష్ణ ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు. కాలేజ్ ఫంక్షన్ కి ఏయన్నార్ రావడంతో అప్పుడు ఆయనకు అందిన ఘన సత్కారాలు చూసి తను కూడా నటుడిని అవ్వాలని అనుకున్నారు కృష్ణ. కృష్ణ కెరియర్ సైడ్ రోల్స్ తోనే మొదలైంది. పందండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట్ర సినిమాల్లో నటించారు కృష్ణ. అయితే ఆ సినిమాల్లో సైడ్ రోల్స్ చేయగా ఆదుర్తి సుబ్బారావు చేసిన తేనెమనసులు సినిమా తో లీడ్ హీరోగా నటించారు.
ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో కృష్ణకి వరుస ఛాన్సులు వచ్చాయి. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొడుతుండటంతో ఒకసారి శివరంజని వార పత్రిక పెట్టిన సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ ఓటింగ్ లో కృష్ణకే ఎక్కువ ఓట్లు రాగా అప్పటి నుంచి ఆయన తెర మీద సూపర్ స్టార్ కృష్ణ అని వేస్తూ వచ్చారు. కృష్ణ గారి మరణ వార్త సినీ ప్రపంచాన్ని శోక సముద్రలో పడేసింది.. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వారి ఫ్యామిలీకి ప్రగాడ సానుభూతి అందిస్తున్నారు సినీ ప్రియులు.