SuperStar Krishna : కృష్ణ ఆస్తి పంపకాలలో సంచలన విషయాలు.. మహేష్ బాబు, నరేష్‌లకి వాటా ఎంతంటే…?
SuperStar Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 తెల్లవారుజామున మరణించిన సంగతి మనకు తెలిసిందే. తేనెమనసులు అనే సినిమా ద్వారా మొదటిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణ ఆ తర్వాత తన ఖాతాలో ఎన్నో హిట్స్ వేసుకున్నాడు. కృష్ణ రాకతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త శకం మొదలైంది అని చాలామంది అంటుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. ఎవరు చేయని సినిమాలు చేసిన కృష్ణ ఆస్తులు మాత్రం కూడబెట్టుకోలేకపోయారు. అప్పట్లో కృష్ణ మంచి రెమ్యూనరేషన్ అయితే తీసుకునేవాడు.
కాకపోతే అతని మంచితనం వలన చాలా పోగొట్టుకున్నాడట. కృష్ణ 40 చిత్రాలు చేసే వరకు కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 5000 మాత్రమే నట.నిర్మాతల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ తన మూవీ ఫెయిల్యూర్ తో నష్టపోయిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొన్ని ఫ్రీగా చేసి పెట్టేవారట. ఆ విధంగా నిర్మాతలను ఆదుకున్న కృష్ణ స్నేహితులను నమ్మి కృష్ణ కోట్లలో నష్టపోయారని టాక్.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని వారు ఎందరో ఉన్నారని. వారిని కృష్ణ ఏ రోజు కూడా పల్లెత్తు మాట కూడా అనలేదని తెలుస్తుంది. కృష్ణ పేరిట చాలా ఆస్తి ఉండగా, అందులో పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన స్థిర, చర ఆస్తులు ఉన్నాయి.
SuperStar Krishna : అంత పని చేశాడా…!
వీటి విలువ నాలుగు వందల కోట్లకు పైమాటేనట. ఈ మొత్తాన్ని కృష్ణ తన కొడుకులకు రాయకుండా మనవళ్లు, మనవరాళ్లకు రాశారట. స్టెప్ సన్ అయిన నరేష్‌కి కూడా చిల్లి గవ్వ ఇవ్వలేదట. కృష్ణ వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకులకు పుట్టిన పిల్లలకు రాసేశారనే టాక్ ప్రస్తుతం ఫిలిం నగర్‌లో నడుస్తుంది. కూతుళ్ళకు కట్న కానుకల రూపంలో ముందుగానే ఇచ్చారు కాబట్టి మొత్తాన్ని మనవళ్ల పేరుపై రాసినట్టు తెలుస్తుంది. ఒకే సంవత్సరంలో 24సినిమాలు విడుదల చేయటం, ఒకే రోజులో నాలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొనటం, తన సొంత బ్యానర్ నుండి వరుసగా సినిమాలను నిర్మించటం ఇలా సినిమానే ఊపిరిగా బ్రతికిన కృష్ణ ఆర్ధికంగా మాత్రం ఎందుకో అంత ఎదగలేకపోయారు.