Big Boss 7 : బిగ్ బాస్ 7 హౌస్ లోకి తల్లీకూతుళ్ళ ఎంట్రీ .. ఇక రచ్చ రచ్చే ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Boss 7 : బిగ్ బాస్ 7 హౌస్ లోకి తల్లీకూతుళ్ళ ఎంట్రీ .. ఇక రచ్చ రచ్చే ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2023,12:00 pm

Big Boss 7 : బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన బిగ్ బాస్ రియాలిటీ షోను టాలీవుడ్లోకి కూడా తీసుకొచ్చారు. ఇక టాలీవుడ్ లో కూడా బిగ్బాస్ షో కి మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బిగ్ బాస్ షో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక బిగ్ బాస్ షో ద్వారా సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీలు అయిపోయారు. ఈ షో కి మొదటి సీజన్ ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్లో నాని, మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి అయ్యి ఏడవ సీజన్ కు రెడీగా ఉంది. ఇటీవల నాగార్జునకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

ఈ ప్రోమోలో కుడి ఎడమ అయితే అనే పాటకు సందడి చేశారు. అంతేకాదు ఈసారి సరికొత్త టాస్కులు, రూల్స్, కండిషన్స్ ఉంటాయని చెప్పారు నాగార్జున. అంతేకాదు ఈసారి బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఇద్దరు తల్లి కూతుర్లు ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన బిగ్బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లు రేటింగ్ రాకపోవడంతో ఈసారి ఎలాగైనా ప్రేక్షకులను మెప్పించాలని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాస్కులు రూల్స్ వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే వాళ్ళని అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేది వీళ్లే అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

Surekha Vani her daughter Suprita entry to Big boss

Surekha Vani her daughter Suprita entry to Big boss

అమర్ దీప్, తేజస్విని, యూట్యూబ్ జంట పవిత్ర వర్ష సింగర్ మోహన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి ఆమె కూతురు సుప్రీత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన కూతురు సుప్రీతా తో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంతా కాదు. అలాంటిది వీళ్లు బిగ్ బాస్ లోకి అడుగుపెడితే మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ చేస్తారు అని అంటున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది