Surekhavani : అవసరానికి వాడుకొని ఇప్పుడు వదిలేశారు-నటి సురేఖా వాణి సెన్సేషనల్ కామెంట్స్..!

Authored By aruna | The Telugu News | Published on: October 12, 2023, 8:00 pm

Surekhavani  : తెలుగు పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణికి ఎంతో గుర్తింపు ఉంది. ఎన్నో తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లిగా , అక్కగా, వదినగా పాత్రలు చేశారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈమె తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అవికాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

అప్పుడప్పుడు పార్టీలు, వెకేషన్ లకు వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు సురేఖ వాణి. సినిమాలో నటన కన్నా ఆమె సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో సురేఖ వాణికి సినిమాల మీద ఆసక్తి తగ్గిందేమో అని అంటున్నారు. ఈమధ్య కాలంలో సురేఖవాణి డబ్ స్మాష్ వీడియోలను తెగ చేస్తున్న సంగతి తెలిసిందే.

Surekhavani about on he

Surekhavani about on he

మరీ ముఖ్యంగా ఈమె వైయస్ షర్మిల వీడియోలను షేర్ చేస్తూ వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా అలాంటి వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాకు ఎవరూ లేరు ఉండాలని కూడా అనుకోవడం లేదు, మీలాగా లేని ప్రేమలు నటించే లైఫ్ నాది కాదు అంటూ వీడియో షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది నిజజీవితంలో సురేఖవాణిని ఎవరైనా వాడుకొని వదిలేసారా, అందుకే ఇలా ఫీల్ డైలాగ్ చెప్పినట్లు పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సురేఖ వాణి సోషల్ మీడియాలో మరోసారి ఇలా వైరల్ గా మారారు.

aruna

No bio available for this author.

  1. "Whatsapp : వాట్సాప్ గ్రూప్‌లో చేరి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్న వృద్ధుడు.. మరో రూ.20 లక్షలు డిమాండ్!"

  2. "410 Million Mars Meteorite : భూమిపై పడిన 410 కోట్ల ఏళ్ల నాటి మార్స్ రాయి.. అంగారకుడిపై జీవం ఉందా..?"

  3. "Rapido Driver : నువ్వు సూప‌ర్ గురూ.. ర్యాపిడో పార్సిల్‌లో బంగారం పంపితే.. నగలతో డ్రైవర్ జంప్‌..!"

  4. "Adarsha Kutumbam : వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’కు కాపీరైట్ చిక్కులు.. అసలేం జరిగింది..?"

  5. "Breakup : మూడేళ్ల ప్రేమకు ముగింపు.. స్టార్ హీరో కొడుకుతో ఆ హీరోయిన్ కూతురు లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్..!"

  6. "Vijayawada Mayor Election : విజయవాడ మేయర్ పోరు రసవత్తరం.. కూటమి, వైసీపీకి ఏబీవీ సవాల్!"

  7. "10th New Rules : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp