Comedian Lakshmipathi : ఆ ఒక్క సినిమాతో ఎన్ని కష్టాలు అనుభవించాడో కమెడియన్ లక్ష్మీపతి … తెలిస్తే కన్నీళ్లు ఆగవు .. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Comedian Lakshmipathi : ఆ ఒక్క సినిమాతో ఎన్ని కష్టాలు అనుభవించాడో కమెడియన్ లక్ష్మీపతి … తెలిస్తే కన్నీళ్లు ఆగవు .. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :25 December 2022,8:00 pm

Comedian Lakshmipathi : కమెడియన్ లక్ష్మీపతి కితకితలు, అల్లరి, ఆంధ్రుడు, పెదబాబు వంటి సినిమాలో కమెడియన్ గా నటించారు. ముఖ్యంగా లక్ష్మీపతి సునీల్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ చూస్తే ఫుల్లుగా నవ్వు వస్తుంది. అలాంటి లక్ష్మీపతి 2008లో మృతి చెందారు. ఈయన కంటే ముందు ఆయన తమ్ముడు శోభన్ గుండెపోటుతో నెల రోజుల క్రితం మరణించారు. ఆ బాధతో నెలరోజుల తర్వాత లక్ష్మీపతి మరణించారు. దీంతో తండ్రిని, బాబాయిని కోల్పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి కూతురు శ్వేతా లక్ష్మీపతి చెప్పారు. లక్ష్మీపతి మొదట ఓ టీవీ ఛానల్ స్క్రిప్ట్ రైటర్ గా,

యాంకర్ గా చేసేవారు. ఆ సమయంలోనే ‘ చూడాలని ఉంది ‘ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో పూర్తిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికే ఆయన తమ్ముడు శోభన్ కృష్ణ నటించిన ‘ రైతు భారతం ‘ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కొన్నాళ్ల తర్వాత మహేష్ బాబుతో బాబీ సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కుటుంబం ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని బాబాయ్ ప్రతిష్ట కూడా పోయిందని శ్వేత చెప్పుకొచ్చింది. బాబి ఫ్లాప్ అయ్యాక వర్షం సినిమాతో మంచి టాక్ తెచ్చుకున్నాడు శోభన్. అయితే ఆ తర్వాత రవితేజతో చేసిన చంటి సినిమా తో ఆర్థికంగా నష్టపోయామని చెప్పుకొచ్చింది. తన బాబాయ్ చనిపోయినప్పుడు

Swetha Lakshmipathi Emotional Words About Her Father Comedian Lakshmipathi

Swetha Lakshmipathi Emotional Words About Her Father Comedian Lakshmipathi

తన తండ్రి తనను పట్టుకొని ఏడ్చేసారని గుర్తు చేశారు. అయితే అందరూ ఏడుస్తున్న తను మాత్రం ఏడ్చేదాన్ని కాదని అందరూ నిద్రపోయాక రాత్రి ఏడ్చేదాన్ని అని ఆమె అన్నారు. చనిపోయినప్పుడు తాను కూడా ధైర్యం కోల్పోతే మా తమ్ముడు, బాబాయ్ కొడుకులు ఏమైపోతారో అని వాళ్ళ బాధ్యత తీసుకున్నాను అని ఆమె అన్నారు. వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసిన శ్వేత తండ్రి బాబాయ్ ల మీద ప్రేమతో ఒక పుస్తకాన్ని రాశారు. ఇక శోభన్ కొడుకులిద్దరు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, తను నేను, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది