T20 WORLD CUP : హమ్మయ్యా.. పాక్ ఓడిపోయింది.. తెగ ఎంజాయ్ చేస్తున్న ఇండియన్స్
T20 WORLD CUP టీ20 ప్రపంచకప్ -2021 సెమీఫైనల్స్ మ్యాచ్‌లో దాయాది పాక్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబురాలు చేసుకుంటున్నారు. మనకు దక్కనిది దాయాదా పాక్ జట్టుకు ఎందుకు దక్కాలి. మనం ఓడిపోయాం.. పర్లేదు.. తర్వాత చూసుకుంటాం.. కానీ ఇప్పుడు ఒకవేళ పాక్ జట్టు గెలిస్తే వాళ్లు మాములుగా బిల్డప్ ఇవ్వరు అని ఇండియన్స్ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాకుండా ఇండియాలోనూ కొందరు పాక్ సానుభూతి పరులు ఎక్కడో ఓ చోట ఉంటున్నారు.
ఇండియాపై పాక్ ఎప్పుడు మ్యాచ్ గెలిచినా వారు టపాసులు పేలుస్తూ వీధుల్లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. దీనిని నికార్సైన భారతీయులు ఎవరూ జీర్ణించుకోలేదు.నిన్న జరిగిన మ్యాచులో పాకిస్తాన్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. పాక్ జట్టు విధించిన టార్గెట్ ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన కంగారు ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. మ్యాచ్ చివర్లో స్టోయినిస్, వేడ్ చేలరేగి ఆడగా 19వ ఓవరల్లోనే టార్గెట్ ఛేదించి ఆసిస్ విజయాన్ని సొంతం చేసుకుని ఫైనల్స్‌కు చేరింది.

t20 world cup pak loses indians enjoying the tribe
T20 WORLD CUP.. పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు..
దీంతో పాక్ జట్టు ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు. మరోవైపు పాక్ అభిమానులు కూడా ఆ జట్టు ఆటగాళ్లను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసి మరి విమర్శలు గుప్పిస్తున్నారు.టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి పాక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అక్టోబర్ 24 జరిగిన ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు ఇద్దరే చెలరేగి ఆడి పాక్ విజయాలకు రెడ్ కార్పెట్ పరిచారు.
అయితే, ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ ఇండియాపై ఎప్పుడు గెలవలేదు. తొలిసారి విరాట్ సేనపై పాక్ గెలవడంతో పాక్ అభిమానులతో పాటు, ఇండియాలోని కొందరు ఫుల్లు సెలబ్రేట్ చేసుకున్నారు. సెమీస్ లో పాక్ ఓడిపోవడంతో మా రీవెంజ్ ఆస్ట్రేలియా వాళ్లు తీర్చారని, పాక్ కు కప్పు రాకుండా చేశారని ఫుల్ మాస్ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారట.. పాక్ ఇప్పటికి కూడా మౌకా మౌకా అని ఎదరుచూడాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.