Tamanna Bhatia : తమన్నా ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసింది.. అసలు ఏంజరిగింది..?
ప్రధానాంశాలు:
తమన్నా ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసింది.. అసలు ఏంజరిగింది..?
Tamanna Bhatia : మిల్క్ బ్యూటీ తమన్నా Tamanna Love ప్రేమాయణం..పెళ్లి వరకు వెళ్లకుండానే తెగిపోయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె గాఢమైన ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నాళ్లుగానో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత తమ మధ్య కేవలం స్నేహబంధమే ఉందని చెప్పినప్పటికీ, విజయ్ వర్మ కుటుంబ కార్యక్రమంలో ఆమె పాల్గొనడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లడం.

Tamanna Bhatia : తమన్నా ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసింది.. అసలు ఏంజరిగింది..?
Tamanna Bhatia తమన్నా – విజయ్ ఎందుకు విడిపోయినట్లు..?
ఇద్దరు కలిసి చనువుగా ఉండడం ఇవన్నీ చూసి అంత ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. చివరికి గతేడాది తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.
అయితే తాజాగా తమన్నా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ షాక్ ఇచ్చాయి. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, తన పెళ్లిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఇది మాత్రమే కాకుండా గతంలో విజయ్ వర్మతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టం గా తెలుస్తుంది. బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారని అంటున్నారు.