Tamannah – Mehreen : ఈ ఇద్దరి తాపత్రయం ఆ ఒక్కదాని గురించే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannah – Mehreen : ఈ ఇద్దరి తాపత్రయం ఆ ఒక్కదాని గురించే..

 Authored By govind | The Telugu News | Updated on :23 May 2022,9:00 pm

Tamannah – Mehreen : ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న ఓ సీనియర్ హీరోయిన్, ఓ యంగ్ హీరో తాపత్రయం ఒకటే. ఎలాగైనా భారీ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని. ఆ ఇద్దరు హీరోయిన్స్ మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా. తమన్నా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 15ఏళ్ళు కంప్లీట్ అయింది. హిట్స్ కంటే కూడా తమన్నా ఖాతాలో ఫ్లాప్స్ చాలా తక్కువ. దాదాపు అందరు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో జతకట్టింది. హీరోలకు, దర్శక నిర్మాతలకు లక్కీ హీరోయిన్ తమన్నా.అయితే, ఈ మధ్యకాలంలో తమన్నా సినిమాలేవీ బాక్సాఫిస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించడం లేదు.

కొన్ని సినిమాలు మొదలై కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ఏడాది వచ్చిన మాస్ట్రో, సీటిమార్ సినిమాలు తమన్నాకు కలిసి రాలేదు. మాస్ట్రో సినిమాలో హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్ర చేసింది. ఇదే పాత్ర హిందీలో టబు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే, ఇప్పుడు నటించిన ఎఫ్ 3 సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది. తమన్నా మాత్రమే కాదు, మెహ్రీన్‌ది ఇదే పరిస్థితి. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్.ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కాయి.

Tamannah Mehreen about is F3 movie

Tamannah – Mehreen about is F3 movie

Tamannah – Mehreen : ఈ సినిమా హిట్ అయితేనే ఆమె కెరీర్ గాడినపడుతుంది.

కానీ, మెహ్రీన్ ఖాతాలో హిట్స్ కంటే కూడా ఫ్లాప్సే ఎక్కువగా చేరాయి. అయినా అదృష్ఠం కొద్దీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉంది ఒక్క ఎఫ్ సినిమా మాత్రమే. ఈ సినిమా హిట్ అయితేనే ఆమె కెరీర్ గాడినపడుతుంది. లేదంటే మెహ్రీన్ కెరీర్ క్లోజ్ అయినట్టే. అనిల్ రావిపూడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకటేశ్ – వరుణ్ తేజ్ హీరోలుగా నటించారి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది