Samantha : పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌పై వివాదాలు.. తాజాగా కోర్టుకెక్కిన మరో రాష్ట్రం
Samantha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించి ఎప్పటి కప్పుడు మూవీ యూనిట్ అప్ డేట్ ఇస్తుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లోనే ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ పాటపై వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఈ పాటలో కొన్ని పదాలు పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు సంఘం కోర్టును ఆశ్రయించింది. పాటను బ్యాన్ చేయాలని సైతం డిమాండ్ చేసింది. ఇక ఆ వివాదం ముగియక ముందే ఆ పాటపై మరి కొందరు కోర్టు కెక్కారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించడంతో పుష్ప యూనిట్ లో కాస్త టెన్షన్ మొదలైనా.. దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ పాటలో మగవారిని కించపరిచే పదాలున్నాయంటూ తమిళనాడుకు చెందిన పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరులో కోర్టును ఆశ్రయించింది.

tamils resorting to court over samantha item-song
Samantha : తాజాగా తమిళనాడు వంతు..
ఇదిలా ఉండగా ఈ పాట మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 20 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ పాటలోని మాస్ బీట్ ప్రతి ఒక్కరితో స్టెప్పులు వేయిస్తోంది. ఇక భారీ అంచనాల మీద ఈ మూవీ నేడే రిలీజ్ కావడం విశేషం. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ ఇక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే థియేటర్స్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించగా, మంగళం శ్రీను క్యారెక్టర్ లో సునీల్ యాక్ట్ చేశాడు.
