Taraka Ratna : తారకరత్నని ముద్దు పెట్టుకుని విలవిల ఏడ్చిన తండ్రి.. వీడియో వైరల్..!!
Taraka Ratna : 39 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించడం అందరికీ షాక్ గురి చేసింది. 20 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలో ఎంటర్ ఇచ్చిన తారకరత్న.. మిగతా నందమూరి హీరోల మాదిరిగా రాణించలేకపోయారు. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి కొద్దిగా దూరమై ప్రేమ పెళ్లి చేసుకుని అనేక కష్టాలు అనుభవించడం జరిగింది. కానీ మళ్ళీ 2016వ సంవత్సరం నుండి… సినిమాలు పరంగా బిజీ అవుతూ మరో పక్క వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న తారకరత్న … కొద్ది నెలల నుండి రాజకీయంగా బిజీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రలో మొదటి రోజు ఆయనకు గుండెపోటు రావడం 23 రోజులు హాస్పిటల్ లో చావుతో పోరాడి మరణించడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ… ఫిలిం ఛాంబర్ లో కొడుకు పార్తివదేహంపై పడి ఏడుస్తూ ముద్దు పెట్టుకుని.. కన్నీరు మున్నీరయ్యారు. తారకరత్న తండ్రిని ఓదార్చ లేక అనేకమంది ఇబ్బందులు పడ్డారు.
కొడుకు శవం పై తండ్రి విలవిల ఏడుస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుర్ర వయసులోనే అది కూడా పెళ్లయి ముగ్గురు పిల్లలు కలిగిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు. కడసారి తారకరత్ననీ చూడటానికి అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇంకా రాజకీయ నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు.
