Taraka Ratna : తారకరత్న ఆర్థిక పరిస్థితి అసలు విషయం ఇదే.. ఎన్టీఆర్ నెలకు రూ.4 లక్షల సాయంపై క్లారిటీ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 23 February 2023, 1:40 pm

Taraka Ratna ; నందమూరి తారకరత్న మరణ వార్త ఇండస్ట్రీ వర్గాల వారిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. నాలుగు పదుల వయసు కూడా లేకుండానే తారకరత్న మృతి చెందడం పట్ల ఎంతో మంది స్టార్స్ మరియు ప్రముఖులు ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే తారకరత్న యొక్క ఆర్థిక పరిస్థితి గురించి గత కొన్నాళ్లుగా ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ లేకపోవడంతో పాటు ఇంట్లో వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల ఆస్తి కూడా ఇవ్వలేదు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే తారకరత్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది పుకారు యొక్క సారాంశం.

Taraka Ratna financial status rumors clarity

Taraka Ratna financial status rumors clarity

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తారకరత్న కి ఎన్టీఆర్‌ మంచి మనసుతో పెద్ద మొత్తంలో సాయం చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో నెలకు నాలుగు లక్షల రూపాయలను తారకరత్నకు ఆర్థిక సాయం చేయడం జరిగిందట. పిల్లల పెంపకం మరియు కుటుంబ పోషణ కూడా అత్యంత భారంగా మారడంతో తారకరత్న కు ఎన్టీఆర్‌ నెల నెల కూడా ఎన్టీఆర్‌ సాయం చేశాడని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ నందమూరి కుటుంబంకు సన్నిహితంగా ఉండేవారు అంటున్నారు. ఒకానొక సమయంలో తారకరత్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే కానీ కొన్నాళ్లకే అంతా సెటిల్ అయ్యిందట.

Taraka Ratna financial status rumors clarity

Taraka Ratna financial status rumors clarity

తారకరత్న ఒక వైపు సినిమాల్లో నటిస్తూ సక్సెస్ లు దక్కక పోవడంతో మరో వైపు రియల్‌ ఎస్టేట్‌ పై ఫోకస్ పెట్టాడట. దాంతో చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడ్డాడట. తారకరత్న రియల్‌ ఎస్టేట్‌ లో చాలా లాభాలను పొందాడు అని.. కుటుంబకు ఉన్న శివారు భూములను రియల్ ఎస్టేట్‌ వెంచర్స్ గా మార్చి వ్యాపారం చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకున్నాడని.. అందుకే ఇటీవల రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి నాలుగు కార్లను తారకరత్న కొనుగోలు చేశాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. భార్య పిల్లలకు దాదాపుగా పాతిక కోట్ల రూపాయల ఆస్తులను తారకరత్న సంపాదించి ఉంటాడు అని వారు చెబుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి