Taraka Ratna : తారకరత్నకి ఎవ్వరికీ లేని వ్యాధి వచ్చింది .. బతకడం ఇంపాజిబుల్ ?
Taraka Ratna : నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ విషమిస్తూ ఉంది. కుప్పం నుండి బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో… తారకరత్నకి చికిత్స జరుగుతుంది. నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండెపోటుకు గురికావడం పార్టీ శ్రేణులకు నందమూరి అభిమానులకు ఎంతో విచారం కలగజేసింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతునికీ ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తారకరత్న మెలెనా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది.
ఇది అరుదైన వ్యాధి కావడంతో పాటు… చికిత్స అందించడం కష్టతరమని ఎవరికి లేని వ్యాధి రావడంతో బతకడం ఇంపాజిబుల్ అనే టాక్ నడుస్తోంది. మెలెనా వ్యాధికీ గురైన వారు బాధపడే లక్షణాలు చూస్తే ఎగువ జీర్ణాశయంతర మార్గం దెబ్బ తినటం, కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండ్లు, రక్తనాళాల వాపు, రక్తస్రావం తదితర రక్తసంబంధిత వ్యాధులు మెలెనాకు దారితీస్తాయి. మెలెనా వల్ల శరీరంలో రక్తం స్థాయిలు క్రమంగా పడిపోతాయి. రక్తస్రావం అనీమియాకు దారితీస్తుంది. ఫలితంగా బలహీనంగా మారిపోవడమే కాక శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామంతో శరీర రంగు మారటం, అలసట, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం.. అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధికి గురైన వారికి.. పెప్టక్ అలసర్ చికిత్స విధానంతో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్త మార్పిడి చికిత్సలు చేయడం జరుగుద్ది. దీంతో ప్రస్తుతం ఇదే వ్యాధికి తారకరత్న గురికావడంతో గుండె రక్తనాళాల్లోకి రక్తం సరఫరా చేయడం చాల కష్టతరంగా ఉండటంతో బెలూన్ యాంజియో ప్లాస్టిక్ ద్వారా… రక్తాన్ని పంపించడానికి వైద్యులు శ్రమిస్తున్నట్లు సమాచారం. చాలా వరకు చూస్తే తారకరత్న బతకటం ఇంపాజిబుల్ అనే ప్రచారం టీడీపీ శ్రేణులలో గట్టిగా జరుగుతుంది.