Taraka Ratna : తారకరత్న గురించి ఎవరికి తెలియని నిజాన్ని బయటపెట్టిన అలేఖ్య రెడ్డి .. నిజంగా అలాంటివాడా !!
Taraka Ratna : గుండెపోటు రావడంతో తారకరత్న 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తారకరత్న ను తలుచుకొని అభిమానులు ఎంతో కృంగిపోయారు. 39 ఏళ్ల తారకరత్న జీవితం పోరాటాలు, పట్టింపులతో సరిపోయింది. హీరోగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాతో పరిచయమైన తారకరత్న బ్లాక్ బస్టర్ హిట్ ను అనుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ హీరోగా అంత సక్సెస్ కాలేకపోయాడు.
సినీ రంగంలో హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినా తారకరత్న ఎప్పుడు బాధపడలేదు. ఆ తర్వాత విలన్ అవతారం ఎత్తి తనేంటో నిరూపించుకొని నంది అవార్డులను అందుకున్నాడు. అయినా కూడా తారక రత్న పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరమయ్యాడు. నందమూరి ఫ్యామిలీ కూడా చాలా ఏళ్లు తారకరత్నను దూరం పెట్టేసింది. అసలే పెద్ద కుటుంబంలో పుట్టాడు.
సినీ రంగం కాకుండా ఇతర ఇతర వ్యాపారాలలోకి వెళితే తన లైఫ్ ఎలా ఉండేదో. పెళ్లి తర్వాత తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే కుమార్తె నిష్క జన్మించిందో అప్పుడే మళ్లీ ఫ్యామిలీ అతన్ని కలుపుకుంది. ఇలా సినిమా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రేమ పోరాటాలు ఫ్యామిలీకి దూరమైన మొండి గానే జీవితాన్ని ఎదుర్కొన్నాడు. చివరకు రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా డు. ఆ క్రమంలోనే కుప్పం పాదయాత్రకు వెళ్లాడు. విధి ఆడిన నాటకంలో తారకరత్న చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లి