Chiranjeevi : చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మీద పిచ్చ కోపంగా ఉన్న టీడీపీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మీద పిచ్చ కోపంగా ఉన్న టీడీపీ !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 June 2023,10:00 am

Chiranjeevi : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అసలు.. టీడీపీకి, మెగా బ్రదర్స్ కు మధ్య ఉన్న వైరం ఏంటి అని అనుకుంటున్నారా? అసలు మెగా బ్రదర్స్ అంటే టీడీపీ నేతలకు ఎందుకు కోపం అంటారా? మెగా బ్రదర్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు. ఈ ముగ్గురూ ఇప్పుడు చాలా పాపులర్. అయితే.. ఈ ముగ్గురు కూడా ఏదో ఒక విధంగా రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లే. 2008 లో మెగాస్టార్ పార్టీ పెట్టారు. ఆయన పార్టీ ఓడిపోవడం అనేది పక్కన పెడితే.. ప్రజారాజ్యం పార్టీ వల్ల టీడీపీ చతికిలపడిపోయింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా ఓటమి పాలయింది.

కట్ చేస్తే మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టారు. 2014 లోనే పార్టీ పెట్టినా.. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ఓడిపోవడం అనేది పక్కన పెడితే.. జనసేన పార్టీ వల్ల మరోసారి టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే అది ఖచ్చితంగా టీడీపీకే ఎఫెక్ట్ కానుంది.

tdp leaders are angry with chiranjeevi and pawan kalyan

tdp leaders are angry with chiranjeevi and pawan kalyan

Chiranjeevi : చిరంజీవి, పవన్ మీద నోరు పారేసుకుంటున్న టీడీపీ నేతలు

అంటే.. 2009, 2019 ఎన్నికల్లో కేవలం టీడీపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం మెగా బ్రదర్స్ అని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. టీడీపీ నేతలు ఓపెన్ అయి చిరంజీవి, పవన్ మీద నోరు పారేసుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కు మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు చిరంజీవి.. పార్టీని సోనియా గాంధీ కాళ్ల కింద పడేస్తే.. పవన్ ఎందుకు ప్రశ్నించలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పోటీ పెట్టుకోవాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు ఏంటి పవన్ ను ఇలా విమర్శిస్తున్నారు. ఈ రాజకీయాలు ఏంటో ఎప్పటికీ అర్థం కావు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది