Tejaswi Madivada : నాతో అలా చేస్తావా అని నిస్సిగ్గుగా అడిగాడు.. ఓ డైరెక్టర్ పై ‘తేజస్వి’ని హాట్ కామెంట్స్

 Authored By mallesh | The Telugu News | Updated on :23 December 2021,7:00 pm

Tejaswini madiwada : తెలుగు చిత్ర పరిశ్రమలో మూలాల్లోనే కాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో చాలా మంది హీరోయిన్స్ చెప్పిన విషయం తెలిసిందే. ఎవరైనా నటి కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుంటే వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఇంట్లో వారిని ఒప్పించడమే పెద్ద టాస్క్.. సినిమా పరిశ్రమ అనగానే చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. తమ అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్లితే ఫ్యూచర్ ఎలా? ఎవరు పెళ్లి చేసుకుంటారు? గాసిప్స్ వస్తే బంధువులను, కుటుంబ సభ్యులను ఎలా ఫేస్ చేయాలనే భయం పేరెంట్స్‌కు ఉంటుంది. కొందరేమో తన పిల్లలను ప్రోత్సహిస్తుంటే మరికొందరు మాత్రం భయం భయంగానే పంపిస్తుంటారు.

Tejaswini madiwada : ఆ డైరెక్టర్ నిస్సిగ్గుగా అడిగాడట..

Tejaswi Madivada About on a director

Tejaswi Madivada About on a director

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కొందరు తమ టాలెంట్‌తో ఎన్నో అవకాశాలను దక్కించుకుని హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అలాంటి కోవలోకి వస్తుంది నటి తేజస్విని మదివాడ.. ఈ అమ్మడు చాలా కష్టపడి సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెల్లెలిగా యాక్ట్ చేసిన ఈ నటి.. ఆ తర్వాత కొన్ని సినిమాలో లీడ్ రోల్స్ చేసింది. ‘కేరింత’, ‘ఐస్ క్రీమ్‘, ‘జతకలిసే’ వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియాను ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, తేజస్విని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు పేర్కొంది.

సినిమా అవకాశం కోసం వెళితే ఓ డైరెక్టర్ నాతో పడుకుంటావా? అని నిస్సిగ్గుగా అడిగాడని తేజస్విని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయినా తను మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాయని చెప్పింది. తెలుగు నటి అని తెలిసి నేరుగా కొందరు దర్శకులు కమిట్‌మెంట్ అడిగేవారని తేజస్విని వాపోయింది. హిందీ హీరోయిన్లను మాత్రం మేనేజర్ల ద్వారా ఫేవర్ అడుగుతుంటారని తేజస్విని సంచలన కామెంట్స్ చేసింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి