Nandamuri Mokshagna : నందమూరి ‘మోక్షజ్ఞ’ వర్కౌట్స్ స్టార్ట్.. వచ్చే ఏడాది ఫ్యాన్స్‌కు పండగే..?
Nandamuri mokshagna : నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ సంపాదించుకున్న వారిలో హీరో బాలకృష్ణ మరియు జూనియర్ తారక్ మాత్రమే నిలిచారు. బాలయ్య బాబు, ఎన్టీఆర్ సినిమాలు విడుదల అయ్యారంటే చాలు నందమూరి ఫ్యాన్స్ పెద్ద పండగే.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. తారక్ అన్న కళ్యాణ్ రామ్, మరో నటుడు తారకరత్న లాంటి వారు కనిపించడం లేదు.
Nandamuri mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా?
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరపై కనిపించనున్నాడని కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ.. 2021లోనే బాలయ్య తనయుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలి. కానీ అందుకు తను ఇంకా సిద్ధం కాలేదని బాలయ్య పలుమార్లు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆ టైం రానే వచ్చింది. ఇప్పటికే మోక్షజ్ఞకు 27 సంవత్సరాలు వచ్చాయి. బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీయార్ బాలనటులుగా వెండితెరపై కనిపించారు. మోక్షజ్ఞ ఇప్పటికే చాలా ఆలస్యం చేశాడని అనేవారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.
అయితే, 2022లో ఎలాగైనా తన కొడుకును నందమూరి అభిమానులకు పరిచయం చేయాలని బాలయ్య బాబు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన కుమారుడికి బాలయ్య చాలా టైం ఇచ్చారట.. ఇంకా లేట్ చేస్తే అభిమానుల్లో నిరాశ, అనాసక్తి పెరిగే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలుస్తోంది. యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే సరికి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలమని తనయుడికి బాలయ్య బాబు హితోపదేశం చేశారట.. అందుకే దగ్గరుండ మరీ మోక్షజ్ఞతో వర్కౌట్స్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు ఇండస్ట్రీలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది.