Tejaswi Madivada : తెలుగుమ్మాయి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tejaswi Madivada : తెలుగుమ్మాయి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :15 June 2022,10:00 am

Tejaswi Madivada : తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీమణులకు సినిమాలతో అనుకున్నంతగా గుర్తింపు అందుకొకపోయినప్పటికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే పెంచుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత గ్లామరస్ ఫోటోలతో కొంతమంది బ్యూటీలు చాలా తొందరగానే క్లిక్ అయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్కసారి అంటూ మహేష్ బాబు తో కనిపించిన తేజస్వి మదివాడ అంతకుముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఎప్పుడైతే మహేష్ బాబుతో అలా కనిపించిందో అమ్మడు చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అయిపోయింది.

ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో అమ్మడు ఊహించని విధంగా డోస్ పెంచింది. కానీ ఆ సినిమా ఈ బ్యూటీకి అనుకున్నంతగా గుర్తింపు అయితే ఇవ్వలేదు. కానీ గ్లామర్ విషయంలో మాత్రం తేజస్వి తనను తాను కొత్తగా హైలెట్ చేసుకుంది. కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల్లో తేజస్విని కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. ఆ కారణంగా తేజస్వినికి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.

Tejaswi Madivada beautiful looks are stunning

Tejaswi Madivada beautiful looks are stunning

Tejaswi Madivada : తేజస్వీ గ్లామ‌ర‌స్ లుక్స్..

2018లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 2లో తేజస్విని అవకాశం దక్కింది. పొట్టి బట్టలు ధరించి హౌస్ లో గ్లామర్ ఒలకబోసింది. అయితే ఆమె గేమ్ నచ్చని జనాలు త్వరగానే బయటికి పంపేశారు. ఏడు వారాలు హౌస్ లో ఉన్న తేజస్వి అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఏదేమైనా కూడా తేజస్వి మదివాడ గ్లామరస్ అందాలతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు సరికొత్త కిక్ ఇస్తుంది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆమె క్యూట్ లుక్స్‌లో కూడా చాలా అందంగా కనిపించింది. అందంగా వయ్యారాలను ఒలకబోసిన ఈ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే భారీ స్థాయిలో కూడా లైక్స్ దక్కించుకుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది