Tejaswi Madivada : అన్నీ చేసి శ్రీరెడ్డి ప‌త్తిత్తులా మాట్లాడుతుందేంటంటూ ఫైర్ అయిన తేజ‌స్వి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tejaswi Madivada : అన్నీ చేసి శ్రీరెడ్డి ప‌త్తిత్తులా మాట్లాడుతుందేంటంటూ ఫైర్ అయిన తేజ‌స్వి

 Authored By sandeep | The Telugu News | Updated on :16 August 2022,2:40 pm

Tejaswi Madivada : సీతవ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ‌ తేజస్వి మదివాడ. ఈ చిత్రంతో ప‌రిచ‌య‌మైన రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐస్‌ క్రీమ్‌’తో తొలిసారి హీరోయిన్‌గా మారింది.బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ పోతోన్న తేజస్వి తాజాగా కమిట్‌మెంట్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆగస్టు 19న ఈ సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో తాజాగా తేజస్వి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Tejaswi Madivada : ప‌త్తిత్తు ఏమి కాదు..

అవకాశాలు లేకపోవడం వల్లే అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాను అని అనడం తప్పు. నాకు ఆఫర్లు ఉన్నప్పుడే నేను ఐస్‌క్రీమ్ అడల్ట్ కంటెంట్ సినిమా చేశాను. అలాగని అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసిన వారంతా స్టార్స్ అయిపోతారని అనుకోవద్దు. కంటెంట్ నచ్చితే నేను దానిని పట్టించుకోను అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.అలాగే మా కమిట్‌మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి అలాగే రం గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది. మనకు ఏదైనా చేయాలని ఉంటే చేసేయాలి కానీ శ్రీరెడ్డి చేయాల్సిన వన్నీ చేసి ఇతరుల పై ఆరోపణలు చేయడం ఎందుకో అర్ధం కాదు.

Tejaswi Madivada Intresting Comments On Sri Reddy

Tejaswi Madivada Intresting Comments On Sri Reddy

మీటూ ఉద్యమంలో అలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఇలాంటి విషయాలన్నీ కమిట్‌మెంట్ సినిమాలో ఉంటాయి. కమిట్‌మెంట్‌ సినిమాలో నా పాత్ర పేరు తేజస్వి. నా క్యారెక్టర్‌ను నేనే ప్లే చేస్తున్నాను అని తేజస్వి అని చెప్పు కొచ్చింది. మ‌రి తేజ‌స్వి మాట‌ల‌కు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బల్‌దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించగా సాజీష్ రాజేంద్రన్, నరేష్ రానా సినిమాటో గ్రఫిని అందించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుండగా ఈ సందర్భంగా చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది