Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో సింగర్ కోటాలో ఈసారి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో సింగర్ కోటాలో ఈసారి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలుసా..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,8:20 pm

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు అవ్వబోతుంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన కంటెస్టెంట్స్ దాదాపుగా ఎంపిక అయ్యారు. ఉదయ భాను పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. ఆమె పేరు మాత్రమే కాకుండా మరి కొందరి పేర్లు కూడా ప్రముఖంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రతి సీజన్ లో కూడా ఒక సింగర్ కి ఛాన్స్ ఉంటుంది. ఆ సింగర్ కోటాలో ఈ సీజన్‌ కి గాను బుల్లెట్‌ బండి సింగర్ మోహన బోగరాజు అవకాశం దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

నటిగా మోహన బోగరాజు పలు పాటల్లో కనిపించింది. కనుక బిగ్ బాస్ లో ఆమె ఎంటర్‌ టైన్ చేయడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ జాబితా వైరల్‌ అవుతోంది. అందులో మోహన ఉండటం తో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుల్లెట్ బండి పాట మారు మ్రోగడం ఖాయం అన్నట్లుగా మరోసారి అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

telugu Bigg Boss 6 Telugu singer contestant

telugu Bigg Boss 6 Telugu singer contestant

సిరి యొక్క బాయ్ ఫ్రెండ్‌ శ్రీహాన్ కి అవాకాశం దక్కింది. ఆయన మాత్రమే కాకుండా మరి కొందరికి కూడా ఇప్పటికే అగ్రిమెంట్స్ పూర్తి అయ్యాయి. ఈసారి ముగ్గురు సామాన్యులకు అవకాశం వచ్చింది. ఆ ముగ్గురు సామాన్యుల్లో మొదటి వ్యక్తి యూట్యూబ్‌ ఆది గా తెలుస్తోంది. సీజన్ 1 నుండి కూడా బిగ్ బాస్ యొక్క రివ్యూలు ఇస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈయన చేరువ అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈయనకు ఎంత వరకు అదృష్టం కలిసి వస్తుంది అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది