Nagarjuna : తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా నాగార్జునకు వార్నింగ్ తో కూడిన విజ్ఞప్తిని చేస్తున్నారు. గత వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యారు అంటూ కొందరిని ఓటింగ్ లో ఉంచి ప్రేక్షకులతో ఓట్లు వేయించారు. తీరా వీకెండ్ వచ్చేప్పటికీ ఎవ్వరూ కూడా ఎలిమినేట్ అవ్వడం లేదు అంటూ ఉసూరుమనిపించాడు. అలాంటప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టాలి అంటూ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ప్రేక్షకులు ఓటింగ్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ముందు ముందు ఇలాంటి వ్యవహారాలు మళ్లీ జరిగితే అసలు ఓట్లు వేయవద్దు అంటూ పిలుపునిస్తామంటూ బిగ్బాస్ ప్రేక్షకులు హెచ్చరిస్తున్నారు.
మాతో ఓట్లు వేయించి మమ్ములను ఎదవలను చేసి నవ్వించారు.. మమ్ములను రెచ్చగొట్టారు అంటూ నాగార్జున పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటూ నాగార్జున ప్రకటించి అనూహ్యంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం కార్యక్రమాన్ని బహిష్కరిస్తామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. మళ్లీ మళ్లీ మమ్ములను ఎదవలను చేయకండి ప్లీజ్ నాగార్జున గారు అంటూ బ్రహ్మానందం స్టైల్ లో కొందరు సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ టీం కి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాం.. ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లు వేస్తాం. అలాంటిది ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరు ఎలిమినేట్ కావడం లేదు అంటే మా సమయం అంతా వృధా అయినట్లే కదా అంటూ కొందరు బిగ్ బాస్ టీం ని ప్రశ్నిస్తున్నారు. అసలు గత వారం ఎందుకు ఎలిమినేషన్ చేయలేదు మాకు చెప్పాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎలిమినేషన్ చేయకూడదు అని ముందుగానే భావించి ఉంటే ఓటింగ్ కి లైన్లో ఓపెన్ చేయకుండా ఉండాలసింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో కొందరు తీవ్రంగా హర్ట్ అయినట్లుగా అనిపిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.