Thagubothu Ramesh : తాగుబోతు రమేష్ కి అక్కడ చివరి రోజులు.. ఇంక భరించలేం అన్నారట

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 3, 2023, 4:00 pm

Thagubothu Ramesh : జబర్దస్త్ కార్యక్రమం గతంలో మాదిరిగా భారీ రేటింగ్ సొంతం చేసుకోలేక పోతుంది. దాంతో ఆదాయం కూడా చాలా తగ్గిందట. అందుకే జబర్దస్త్ లో ప్రస్తుతం ఉన్న చాలా మంది అనవసరమైన కంటెస్టెంట్స్ ని మరియు టీం లీడర్స్ ని తీసేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న వారిని కూడా వద్దనుకుంటున్న విషయం తెలిసిందే. హైపర్ ఆదిని ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగాడంటూ పక్కకు పెట్టేశారనే ప్రచారం జరుగుతుంది.

Thagubothu Ramesh is going to eliminate Mallemala jabardasth team

Thagubothu Ramesh is going to eliminate Mallemala jabardasth team

ఆ విషయం పక్కన పెడితే జబర్దస్త్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే తాగుబోతు రమేష్ జబర్దస్త్ లో కనిపించకపోవచ్చు, ఆయన గతంలో సినిమాల్లో ఒక వెలుగు వెలిగాడు.. కానీ ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. అందుకే జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చాడు. కాస్త తగ్గి మరో టీం లీడర్ తో టీం ని షేర్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఆయన పట్ల మల్లెమాల వారు కనీకరం చూపించడం లేదు.  తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూనే మరో వైపు ఆయన స్కిట్స్ విషయంలో ఎప్పటికప్పుడు

Thagubothu Ramesh is going to eliminate Mallemala jabardasth team

Thagubothu Ramesh is going to eliminate Mallemala jabardasth team

విమర్శలు చేస్తూనే ఉన్నారట. తాజాగా ఆయన టీం ని తొలగించాలని నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే జబర్దస్త్ నుండి తాగుబోతు రమేష్ టీమ్‌ కనుమరుగవడం ఖాయం అంటూ స్వయంగా ఆయన టీం లోని కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు. అయినా జబర్దస్త్ నుండి తాగుబోతు రమేష్ బయటకు వెళ్ళిపోతే మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp