Thagubothu Ramesh : అయ్యో.. జబర్థస్త్ లో తాగుబోతు రమేష్ రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Thagubothu Ramesh : అయ్యో.. జబర్థస్త్ లో తాగుబోతు రమేష్ రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?

Thagubothu Ramesh : జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చింది అనడం లో సందేహం లేదు. ఒకప్పుడు తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ హోటల్స్ లో పని చేసిన వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. ఖరీదైన హోటల్స్ లో పార్టీ చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు స్టార్స్ గా వెలుగు వెలిగిన కొందరికి ఆ తర్వాత సినిమాల్లో స్థానం లేకుండా పోతే అదే జబర్దస్త్ ఆశ్రయం కల్పిస్తుంది. అందులో ముఖ్యులు తాగుబోతు రమేష్. ఈయన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 November 2022,4:20 pm

Thagubothu Ramesh : జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చింది అనడం లో సందేహం లేదు. ఒకప్పుడు తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ హోటల్స్ లో పని చేసిన వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. ఖరీదైన హోటల్స్ లో పార్టీ చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు స్టార్స్ గా వెలుగు వెలిగిన కొందరికి ఆ తర్వాత సినిమాల్లో స్థానం లేకుండా పోతే అదే జబర్దస్త్ ఆశ్రయం కల్పిస్తుంది. అందులో ముఖ్యులు తాగుబోతు రమేష్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుపరిచితుడు.. ఎన్నో వందల సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. తాగుబోతు రమేష్ ఒకానొక సమయంలో భారీ పారితోషకం తీసుకొని సినిమాల్లో నటించేవాడు.

కానీ మూస పాత్రలు రెగ్యులర్ గా అదే తరహా కామెడీ వల్ల అతడిని ప్రేక్షకులు తిరస్కరించడం మొదలు పెట్టారు. దాంతో సినిమాల్లో ఆఫర్స్ తగ్గాయి. సినిమాల్లో ఆఫర్స్ తగ్గిన వెంటనే తాగుబోతు రమేష్ తెలివిగా జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. ఒకప్పుడు సినిమాల్లో తాగుబోతు రమేష్ తీసుకున్న పారితోషికం తో పోలిస్తే ప్రస్తుతం ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి తీసుకుంటున్న పారితోషికం చాలా చాలా తక్కువ, అయినా కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ప్రస్తుతానికి ఎంతో కొంత క్రేజీ ఉంది. కనుక ఆ క్రేజీ ని ఉపయోగించుకొని జబర్దస్త్ లో కొనసాగుతూ ఎంతో డబ్బు సంపాదించుకోవాలని తాగుబోతు రమేష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాగుబోతు రమేష్ షో లో టీం లీడర్ కాదు మరో టీం లీడర్తో టీం పంచుకుంటున్నాడు, అందుకే ఆయన పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని సమాచారం అందుతుంది.

Thagubothu Ramesh remuneration for jabardasth show

Thagubothu Ramesh remuneration for jabardasth show

బుల్లితెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మందికి ఇస్తున్న పారితోషకం కంటే తాగుబోతు రమేష్ కి మల్లెమాల వారి ఇస్తున్న పారితోషకం చాలా తక్కువ అంటూ తెలుస్తుంది. బుల్లితెర మరియు వెండితెర పై రాణిస్తూ నెట్టుకొస్తున్న తాగుబోతు రమేష్ ముందు ముందు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి జబర్దస్త్ లో కొనసాగాలని భావిస్తున్నాడు. పారితోషికం కోసం కాకుండా సినిమాల్లో మళ్ళీ ఆఫర్స్ వస్తాయనే ఉద్దేశంతోనే తాను జబర్దస్త్ లో చేస్తున్నాను అంటూ సన్నిహితులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి జబర్దస్త్ లో చేస్తున్నందుకు ఇతర కార్యక్రమాల్లో అవకాశాలు వస్తాయి, అలాగే సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కుతుంది అనే ఉద్దేశంతో తాగుబోతు రమేష్ చేస్తున్నాడట తప్ప భారీగా రెమ్యూనరేషన్ అయితే రావడం లేదని సమాచారం అందుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది