Thaman : మ‌ళ్లీ దొరికిపోయిన థ‌మ‌న్.. గాడ్ ఫాద‌ర్‌కి సేమ్ కొట్టావంటూ ట్రోల్స్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Thaman : మ‌ళ్లీ దొరికిపోయిన థ‌మ‌న్.. గాడ్ ఫాద‌ర్‌కి సేమ్ కొట్టావంటూ ట్రోల్స్..!

Thaman : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లో థ‌మ‌న్ ఒక‌రు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సంగీతం అందించిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్ అవుతున్నాయి. థ‌మ‌న్ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చిపడింది. ఆయన సంగీతంలో కొత్తదనం కావాలంటే.. ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ అవ్వాలా అని నెటిజ‌న్స్ అనుకుంటున్నారు. అందుకు కార‌ణం ఆదివారం విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టీజర్‌. ఈ టీజ‌ర్ చూశాక నెటిజన్లకి ఆ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 August 2022,3:40 pm

Thaman : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లో థ‌మ‌న్ ఒక‌రు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సంగీతం అందించిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్ అవుతున్నాయి. థ‌మ‌న్ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చిపడింది. ఆయన సంగీతంలో కొత్తదనం కావాలంటే.. ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ అవ్వాలా అని నెటిజ‌న్స్ అనుకుంటున్నారు. అందుకు కార‌ణం ఆదివారం విడుదలైన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టీజర్‌. ఈ టీజ‌ర్ చూశాక నెటిజన్లకి ఆ మ్యూజిక్‌ ఎక్కడో వినినట్లుగా ఉంది అనుకుంటూ సెర్చింగ్‌ మొదలెట్టి.. ఆఖరికి ‘గని’ దగ్గర ఆగిపోయారు.

Thaman : కాపీ మ‌ర‌క‌లు..

టీజర్ లో బిజియం గమనిస్తే వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీ గని బిజియం గుర్తుకు వస్తోంది. గని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గాడ్ ఫాదర్ చిత్రానికి రిపీట్ చేసారు అంటూ తమన్ పై అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ సినిమా బిజియంనే మళ్ళీ రిపీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. ఇలాంటి తప్పు జరగకుండా తమన్ ఇకనైనా జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో గాడ్ ఫాదర్ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Thaman Gets Copy Trolls On GodFather Teaser BGM

Thaman Gets Copy Trolls On GodFather Teaser BGM

తమన్‌ సంగీతంలో కాపీ అనే మాట కచ్చితంగా వస్తుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఇదే మాట ఎక్కడో దగ్గర వినిపిస్తుంది. దీంతో కాపీ ట్రోలింగ్‌ తమన్‌కి కూడా అలవాటు అయిపోయింది. మరీ అడిగితే.. నా మ్యూజిక్‌ నేనే మళ్లీ కొట్టాను, వేరే వాళ్లది కాదు కదా అని కూడా అంటాడు. త్రివిక్ర‌మ్ అలా వైకుంఠ‌పురములో చిత్రం కోసం మాత్రం థ‌మ‌న్ ప్ర‌త్యేక సంగీతం అందిచాడు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన మహేష్ పేరుతో మ మ మహేషా అంటూ సాగుతున్న ఆ సాంగ్ మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ పాట మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా కోసం రూపొందించిన విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది