
Rashmi Gautam
Rashmi Gautam : నటిగా ఇండస్ట్రీకి వచ్చిన రష్మీ గౌతమ్ యాంకర్‌గా మారాక మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ యాంకర్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. ఆమె తన యాంకరింగ్‌తో పాటు సేవా దృక్పథంతో చాలా మంది మనసులని కదిలించింది. పెట్స్ కోసం, మూగ జీవాల కోసం ఆమె వేసే ట్వీట్లు అందరినీ కదిలిస్తుంటాయి. అయితే కొందరు మాత్రం మనుషులు పోతుంటే పట్టించుకోరు గానీ.. ఇలా కుక్కలు, ఆవులు అంటూ సానుభూతి చూపిస్తుంటారంటూ ఆమెని తెగ ట్రోల్ చేస్తుంటారు.. ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు. మూగజీవాలను ఆహారం కోసం లేదా, ఇతర కారణాలతో హింసిస్తే ఆమె తట్టుకోలేరు. జంతువుల రక్షణ కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తుంది.
రష్మీ పెట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఆమె మాంసాహారమే కాదు… పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా తినరు. అయితే మూగ జీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసే సోషల్ మీడియా కామెంట్స్ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. గత ఏడాది హైదరాబాద్ లో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపిన సమయంలో ఆమె కుక్కని సమర్ధిస్తూ తల్లిదండ్రులదే తప్పన్నట్టు మాట్లాడింది. అప్పుడు రష్మీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇక బక్రీద్ పండగకు జరిగే గోవధను కూడా ఆమె వ్యతిరేకించడం వివాదాస్పదం అయ్యింది. తాజాగా ఓ వ్యక్తి వ్యక్తి గన్ను పట్టుకుని ఆవుని షూట్ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్‌కు రష్మీ రిప్లై ఇచ్చింది. హిందువులుగా మనం ఇది జరగనిచ్చి ఉండాల్సింది కాదు. ఇదంతా మన తప్పే అన్నట్టుగా రష్మీ చెప్పుకొచ్చింది. రష్మీ వేసిన ట్వీట్ కి మరో నెటిజన్ సెటైరికల్‌గా స్పందించాడు.
ఆడపిల్లను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి… అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై స్పందించిన రష్మీ గౌతమ్… ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లలను చంపుతాడు. వాడికి మనిషికి పశువుకు తేడా తెలియదు బ్రెయిన్ వాడు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అనే షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు వెండితెరపై రష్మీ ఆచితూచి కథలను ఎంచుకుంటోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.