The Raja Saab Movie 8th Day Collections : మిక్స్‌డ్ టాక్ మధ్యనూ ప్రభాస్ మ్యాజిక్ .. 8 రోజుల్లో ‘ది రాజా సాబ్’ 200 కోట్ల మార్క్ దిశగా!
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రభాస్ స్టార్డమ్ బాక్సాఫీస్ వద్ద గట్టి ప్రభావం చూపించింది. ముఖ్యంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి సీజన్ మొదలవడంతో థియేటర్లలో పోటీ ఒక్కసారిగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుండగా, రవితేజ ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ మాస్ సెంటర్లలో బలంగా నిలిచింది. ఇదే సమయంలో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద ‘నారీనారీ నడుమ మురారీ’ విడుదల కావడంతో యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాల మధ్య విభజనకు గురవుతున్నారు.
The Raja Saab Movie 8th Day Collections : మిక్స్‌డ్ టాక్ మధ్యనూ ప్రభాస్ మ్యాజిక్ .. 8 రోజుల్లో ‘ది రాజా సాబ్’ 200 కోట్ల మార్క్ దిశగా!
The Raja Saab Movie 8th Day Collections కలెక్షన్స్ అదుర్స్..
ఈ కారణంగా ‘ది రాజా సాబ్’కు స్క్రీన్స్, షో టైమింగ్స్ పరంగా గట్టి పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని భాషల కలిపి రూ.250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన సినిమా పూర్తిస్థాయిలో సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వీకెండ్‌లోనే సినిమా వరల్డ్‌వైడ్‌గా భారీ వసూళ్లు సాధించింది. ఇండియా నెట్‌గా రూ.108 కోట్లు, ఇండియా గ్రాస్‌గా రూ.129.84 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ నుంచి రూ.33.67 కోట్లు వచ్చాయి. దీంతో తొలి వీకెండ్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.163.51 కోట్లకు చేరింది. మిక్స్‌డ్ టాక్ మధ్య ఈ స్థాయి ఓపెనింగ్ రావడం ప్రభాస్ మార్కెట్‌కు నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
వీక్‌డేస్‌లోనూ సినిమా నిలకడగా కొనసాగింది.
డే 4 (సోమవారం): రూ.9.2 కోట్లు
డే 5 (మంగళవారం): రూ.6.69 కోట్లు
డే 6 (బుధవారం): రూ.7.46 కోట్లు
డే 7 (గురువారం): రూ.7.88 కోట్లు
ఇక 8వ రోజు (శుక్రవారం) మరో రూ.8.79 కోట్లు రాబట్టే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. దీంతో 8 రోజుల్లో మొత్తం కలిపి ఇండియా నెట్ రూ.136.7 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.156.76 కోట్లు, ఓవర్సీస్ రూ.37.98 కోట్లు చేరి, వరల్డ్‌వైడ్ గ్రాస్ సుమారు రూ.203.53 కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం ‘ది రాజా సాబ్’ 8 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా, మూవీ యూనిట్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ మరో చర్చకు దారి తీసింది. అధికారిక ప్రకటనలో మొదటి 7 రోజుల్లోనే రూ.238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటిస్తూ ‘KING SIZE BLOCKBUSTER’ అని పేర్కొన్నారు. ట్రేడ్ అంచనాలు, అధికారిక గణాంకాల మధ్య కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ కొనసాగుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
The Raja Saab Movie 8th Day Collections , The Raja Saab Box Office Collections, Prabhas Raja Saab Movie,The Raja Saab Worldwide Collections , The Raja Saab 200 Crores Club, Prabhas Latest Movie Collections, ది రాజా సాబ్ మూవీ 8వ రోజు కలెక్షన్లు , ప్రభాస్ రాజా సాబ్ బాక్సాఫీస్ కలెక్షన్లు, రాజా సాబ్ 200 కోట్ల క్లబ్, ప్రభాస్ తాజా సినిమా కలెక్షన్లు,
ది రాజా సాబ్ వరల్డ్‌వైడ్ వసూళ్లు ,