The Raja Saab Movie Review : ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
The Raja Saab Movie Review : ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
The Raja Saab Movie Review : రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది రాజా సాబ్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యహరించారు. ప్రభాస్ ను సరికొత్త హారర్- కామెడీ జానర్లో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు. రేపు ఈ మూవీ జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, అయితే ఒక రోజు ముందుగానే జనవరి 8న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోస్ పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు సినిమా ఎలా ఉంది ? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ? మారుతీ ప్రభాస్ ను ఎలా చూపించాడు ? కామెడీ & హర్రర్ వర్క్ అవుట్ అయ్యిందా ? అనేది పంచుకుంటున్నారు. మరి సినిమా ఎలా ఉందో చూసేద్దాం.
The Raja Saab Movie Review : ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
The Raja Saab Movie Review : ది రాజా సాబ్ మూవీ కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక పురాతన రాజభవనం మరియు దాని చుట్టూ అల్లబడిన రహస్యాల చుట్టూ తిరుగుతుంది. రాజకుటుంబ వారసుడైన రాజా సాబ్ (ప్రభాస్), తన నానమ్మతో కలిసి ఒక సాధారణ యువకుడిలా ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. అయితే ఆ భవనాన్ని విక్రయించాలనుకున్న తరుణంలో, అక్కడ కొలువై ఉన్న ఆత్మలతో రాజా సాబ్‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి? తన తాత ఆత్మతో అతను చేసిన పోరాటం ఏంటి? అనే అంశాలను మారుతి తనదైన శైలిలో హాస్యం మరియు హారర్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా ఆవిష్కరించారు. కథలో హారర్ ఉన్నప్పటికీ, ఎక్కడా వినోదం తగ్గకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు.
ఇది కూడా చదవండి ==>The Raja Saab First Day Collection : ‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు మరి ఇంత దారుణమా ?
సాంకేతిక పరంగా చూస్తే, ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) హారర్ సన్నివేశాల్లో భయాన్ని కలిగిస్తూనే, మాస్ సాంగ్స్ లో ఎనర్జీని నింపింది. రాజభవనం సెట్ డిజైనింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ సినిమా రిచ్‌నెస్‌ను పెంచాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, ఓవరాల్‌గా సినిమా బోర్ కొట్టకుండా సాగిపోతుంది.
సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్‌ను చూడాలనుకునే వారికి, హాయిగా నవ్వుకోవాలనుకునే కుటుంబ ప్రేక్షకులకు ‘రాజా సాబ్’ ఒక బెస్ట్ ఛాయిస్.
ఇది కూడా చదవండి ==> Akhanda 2 Distributors : శ్రీనుగారు మా నష్టాలను ఎవరు పూడుస్తారు?
ఈ సినిమా కథ అంత దేవనగర సామ్రాజ్య జమిందారిణి గంగాదేవి (జరీనా వాహెబ్) ఆస్తులను అపహరించాలనే దురాశతో కనకరాజు (సంజయ్ దత్) చేసే కుతంత్రాల చుట్టూ తిరుగుతుంది. క్షుద్ర శక్తుల సాయంతో ఆమెను వశం చేసుకున్న కనకరాజు, చనిపోయిన తర్వాత కూడా ఆ సంపద తన వారసులకే దక్కాలని ఆత్మగా మారి కోటను పీడిస్తుంటాడు. ఈ నేపథ్యంలో తన నానమ్మ కోరిక మేరకు తాతను వెతికేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన రాజు (ప్రభాస్), నర్సాపూర్ ఫారెస్ట్‌లోని ఆ మిస్టరీ కోటలోకి ఎలా ప్రవేశించాడు, అక్కడ ఆత్మగా మారిన కనకరాజుతో సాగించిన మైండ్ గేమ్ ఏంటి అనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
విశ్లేషణ :
సాంకేతికంగా మరియు నటన పరంగా చూస్తే, ప్రభాస్ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో మరియు యాక్టింగ్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సంజయ్ దత్ మరియు ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు, వారి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే, దర్శకుడు మారుతి ఒక బలమైన పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని వెండితెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారు. దాదాపు 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ నిడివి సినిమాకు ప్రధాన శాపంగా మారింది. ఫస్టాఫ్‌లో కథను ముందుకు నడపకుండా గంట సేపు ఒకే చోట తిప్పడం, అనవసరమైన సీన్లు మరియు పాటలు కథా గమనాన్ని దెబ్బతీశాయి.
మరోవైపు ఈ చిత్రానికి ఎంతో కీలకం కావాల్సిన గ్రాఫిక్స్ (VFX) మరియు సంగీతం ఆశించిన స్థాయిలో లేవు. టీజర్ సమయంలోనే విమర్శలు ఎదుర్కొన్న గ్రాఫిక్స్ పనితీరు కొన్ని చోట్ల నాసిరకంగా ఉండి నిరాశపరిచింది, అయితే మొసలి ఫైట్ వంటి సీన్లు మాత్రం బాగున్నాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా చాలా చోట్ల శృతిమించినట్టుగా అనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, కథలో వారికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం కావడం బలహీనతగా మారింది. మొత్తానికి ప్రభాస్ ఇమేజ్ కోసం రాసుకున్న అనవసరపు హంగుల వల్ల అసలు కథ పక్కదారి పట్టినట్లు అనిపించినా, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆయన ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ మాత్రం కచ్చితంగా కంటికి విందుగా ఉంటాయి.