Womens : మహిళలు చున్నీలు ఎందుకు ధరించడం లేదు అంటున్న ప్రశ్నకి.. ఈ అమ్మాయి ఇచ్చిన జవాబు ఇంటే సన్మానం చేస్తారు.!
Womens : ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామంది మహిళలు ఫ్యాషన్ అంటూ ఎన్నో రకాల బట్టలను ధరిస్తున్నారు. ఇలా ఫ్యాషన్ దుస్తులను ధరించడం అనేది మహిళలు అయిన పురుషులు అయిన ఫ్యాషన్ గా కనిపించాలి అనేదే ముఖ్య ఉద్దేశం. ఇలా దుస్తుల ధరించడంపై పురుషుల కంటే మహిళలు పై ఎక్కువగా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మహిళలలో దుస్తుల వేసుకునే క్రమంలో ప్రతిరోజు టాప్ అనేది ధరిస్తూనే ఉంటారు. దీనితో ఒక పాయింట్ను ధరిస్తారు. ఈ దుస్తులు చూడడానికి పంజాబీ డ్రెస్ ల కనిపిస్తున్నప్పటికీ ఈ డ్రెస్సులకు దుప్పట అనేది ఉండదు. ఈ మధ్యకాలంలో ఇలా వేసుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఇలా వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ గా , ట్రెండీ లుక్కుల కోసం ఇలా ఆడవారు దుప్పటాలను ధరించడం లేదు. అలాగే ఇటీవల లో మహిళలు చున్నీలు ఎందుకు ధరించడం లేదు అన్న ప్రశ్నకు..
ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వారికి షాకింగ్ ఆన్సర్ ను ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు లలిత . అయితే ఆ అమ్మాయి నాకు కంఫర్టబుల్గా చున్ని ఉండదు కాబట్టి నేను ధరించను అని సమాధానం ఇచ్చింది. నాకు 16 సంవత్సరాల వయసులో ఉన్న టైంలో నేను దుప్పటా ధరించినప్పుడు మా అమ్మగారి చేతిని పట్టుకొని వెళ్తూ ఉన్న సమయంలో కొందరు వారు చూసే చూపులని చాలా ఓపిక పట్టాను. అయితే నాకు 21 ఏళ్ల వయసులో నేను తిరుపతికి వెళ్లి అక్కడ నా తలనీలాలను సమర్పించాను. అప్పుడు కూడా కొందరి దరిద్రులు కళ్ళు నన్ను తినేసేలా చూసాయి. అయితే ప్రస్తుతం నేను దుప్పటా ధరించిన ధరించకపోయినా నా దగ్గర ఎవ్వరైనా ఏలాంటి దరిద్రులైన వేషాలు వేయ్యరు. ఎందుకనగా ఆనాడు నాలో లేనిది ప్రస్తుతం నాలో ఉన్నది.
ఒకటే నేను ధైర్యంగా ఉండడం అని ఆ అమ్మాయి దిమ్మ తిరిగి సమాధానం ఇచ్చింది. అయితే నా ఆవరణలో ఉన్న వాళ్లలో ఎలాంటి నికృష్టుడి ఏ చూపుతో నన్ను చూస్తారో తెలుసుకొనే సత్తా నాకుంది. వారికి దిమ్మతిరిగే పోయే సమాధానం ఇచ్చే అంత దమ్ము నాలో ఉంది. ఇవన్నీ నేను మలుచుకొని ధైర్యంగా ఎటువంటి ఇబ్బందులు నైనా ఎదుర్కొంటున్నాను. అందరూ ఇలాంటివన్నీ చెప్పడం మానేసి మీకు అవకాశం ఉంటే మహిళలకు ధైర్యాన్ని నూరి పోయండి. ఇలాంటివి ఏమీ మీకు చేతకాక మహిళల వస్త్రధారణ పై ఎన్నో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇలా సాంప్రదాయాల పేరుతో వారిని ఇబ్బంది పెట్టకండి. మీకు చేతనైతే మహిళలకు కరాటే కోచింగ్ ఇప్పించండి చాలా ఉపయోగముంటుంది సమాజంలో అంటూ ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.