Virupaksha Movie : విరూపాక్ష సినిమా చూసే ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది !
Virupaksha Movie : ఏడాదిన్నర క్రితం దాదాపు ప్రాణాలు పోయేంత రోడ్డు ప్రమాదానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురైన సంగతి తెలిసిందే. ఎంతో క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత మాట కోల్పోవడం… తిరిగి స్పష్టంగా మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మాట సంపాదించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో అవరోధాలు ఎదుర్కొని.. ఏప్రిల్ 21వ తారీకు నాడు “వీరూపాక్ష” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. టాలీవుడ్ టాప్ మోస్ట్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
యాక్షన్ త్రిల్లర్ హర్రర్ నేపథ్యంలో చాలాకాలం తర్వాత తెలుగులో వచ్చిన ఈ సినిమా… రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమాలో తేజ్ పెర్ఫార్మెన్స్ కార్తీక్ దండు టేకింగ్… సినిమా లవర్స్ నీ ఎంతగానో కట్టిపడేసాయి. దీంతో సినీ ప్రేమికులు “విరూపాక్ష” థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో “విరూపాక్ష” సినిమా యూనిట్ సినిమా చూసే ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్ తెలియజేసింది. మేటర్ లోకి వెళ్తే సినిమా చూసిన ప్రతి ఒక్కరు స్టోరీ బయటకు రివీల్ చేయొద్దని సూచించింది.
ముఖ్యంగా కథలో వచ్చే త్రిల్లింగ్ ట్విస్టులు ఎక్కడ బయట పెట్టొద్దని లీక్ చేయొద్దని… ఆడియన్స్ నీ కోరడం జరిగింది. “విరూపాక్ష” థియేటర్ లో ఓ అద్భుతమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేలా అందరూ సహకరించాలని కోరడం జరిగింది. హర్రర్ నేపథ్యంలో భయాన్ని కలిగించే సన్నివేశాలు… ఊహకందని లాజిక్ ట్విస్టులు.. సినిమాలో ఉండటంతో.. తెలుగు ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. చాలాకాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ కి హిట్ పడటంతో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.