Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. డైరెక్ట‌ర్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. డైరెక్ట‌ర్ కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,2:56 pm

ప్రధానాంశాలు:

  •  Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. డైరెక్ట‌ర్ కామెంట్స్

Hari Hara Veera Mallu : పవన్‌ కళ్యాణ్‌ Pawan Kalyan హీరోగా నటించిన హరి హర వీరమల్లు మూవీ గురువారం విడుదలై మిశ్రమ స్పందనతో రన్‌ అవుతోంది. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం నిర్మించారు. ఔరంగజేబ్‌ ఆగడాలను చూపిస్తూ, హిందువులుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధనని తెచ్చి జనాలను ఎలా ఇబ్బంది పెట్టాడనేది ఇందులో చూపించారు.

Hari Hara Veera Mallu హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే డైరెక్ట‌ర్ కామెంట్స్

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. డైరెక్ట‌ర్ కామెంట్స్

Hari Hara Veera Mallu : కార‌ణం ఇది..

హరి హర వీరమల్లు మొదటి రోజు మంచి వసూళ్లని రాబట్టింది. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్‌ ద్వారా సుమారు రూ. 13కోట్ల కలెక్షన్లు రావడం విశేషం. మొదటి రోజు ఇండియాలో రూ. 34.75కోట్లు రాబట్టింది. రెండో రోజు ఎనిమిది కోట్లు. మూడో రోజు రూ.9.86కోట్లు రాబట్టింది. ఇలా మూడు రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ.65కోట్లు(నెట్‌) వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్‌ కలెక్షన్లలతో కలిసి ఈ మూవీ రూ.90కోట్లు(గ్రాస్‌) దాటిందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ముందు నుంచి కలెక్షన్ల ప్రకటనకు దూరంగా ఉన్నారు.ప‌లు సైట్లు హరి హర వీరమల్లు కలెక్షన్లని వెల్లడిస్తున్నాయి. ఈ విషయంపై జ్యోతికృష్ణ స్పందించారు. తాము అధికారికంగా ఏం ప్రకటించినా ఫేక్‌ కలెక్షన్లు అంటారు, అందుకే ప్రకటించడం లేదు. ఎలాగూ కొన్ని సైట్లు తమకు వచ్చిన సమాచారంతో ప్రకటిస్తుంటాయి, కాబట్టి తాము వెల్లడించాలనుకోవడం లేదన్నారు. అయితే సినిమా పోస్టర్లతో సర్క్యూలేట్‌ అవుతున్నవన్నీ ఫేక్‌ కలెక్షన్లు అని, తాము అలాంటి పోస్టర్లు విడుదల చేయలేదని చెప్పారు. కలెక్షన్ల విషయంలో క్లారిటీ వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది