Prabhas : ప్ర‌భాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్ర‌భాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..!

Prabhas : గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే దానిపై హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తూ ఉంటుంది. ప‌లు సందర్భాల‌లో ప్ర‌భాస్ ఫ్యామిలీని కూడా ప్రభాస్ పెళ్లి గురించి ప్ర‌శ్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవ‌ల శ్యామలాదేవిని మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్ళెప్పుడు అని యాంకర్ ప్రశ్నించారు. ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. అది ఎప్పుడనేది తెలియదు.ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నారో మీరే చూస్తున్నారు కదా అని శ్యామలాదేవి అన్నారు. సరైన టైం పెళ్లి కూడా జరుగుతుంది అని ఆమె తెలిపారు.

Prabhas సీక్రెట్ రివీల్..

ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్ళు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. సినిమా తర్వాత మరో సినిమాకి కమిటవుతూ బిజీగా గడుపుతున్నాడు. కల్కి చిత్రం 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. కల్కి తర్వాత ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత బిజీ స‌మ‌యాన పెళ్లి చేసుకుంటాడా అనే సందేహం అంద‌రిలో ఉంది. ఆడియెన్స్‌ను ఎంటర్‌టైనమెంట్ చేయడానికి వరుస సినిమాలు, అందులో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్నాడు కానీ.. పెళ్లి గురించి అడిగితే చిన్న స్మైల్ ఇచ్చి మొహం తిప్పేస్తున్నారు.

Prabhas ప్ర‌భాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా

Prabhas : ప్ర‌భాస్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు సైతం తను ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో తెలిపాడు. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని కూడా ప్లాన్ చేసినట్లు చెప్పాడు. కానీ.. ఆ ముచ్చట తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోడానికి ఓ కారణం ఉందట. ఈ విషయాన్ని స్టార్ యాంకర్ కమ్ హీరోయిన్ సుమ రీసెంట్‌గా వెళ్లిడించింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ప్రభాస్‌ను కలిసినప్పుడు, పెళ్లి గురించి అడిగానని సుమ చెప్పారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం గురించి చెప్పినట్లు సుమ అన్నది. అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ చేయకూడదనే పెళ్లి చేసుకోవట్లేదని ప్రభాస్ తనతో చెప్పాడని సుమ చెప్పింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది