Krishnam Raju : కృష్ణం రాజు ఇంటికి వస్తే కడుపు నింపకుండా పంపరట.. దానికి కారణమెంటంటే..!
Krishnam Raju : 83 ఏళ్ల వయస్సులో కృష్ణం రాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి సినీపరిశ్రమకు తీరని విషాదం. తెలుగు సినిమా పై కృష్ణంరాజు తనదైన ముద్రవేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. కృష్ణంరాజు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. గోదావరి జిల్లా అంటేనే మర్యాదలు గుర్తొస్తాయి. ఇక కృష్ణంరాజు మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఇంటికి వచ్చిన వారికీ మర్యాదలతో ముంచెత్తుతారు. అదే ప్రభాస్ కూడా అలవాటు చేసుకున్నారు.
Krishnam Raju : ఇది కారణం..
కృష్ణంరాజు మర్యాదల వెనక ఓ కథ కూడా ఉందట. ‘కృష్ణంరాజు చిన్నతనంలో.. ఓ సారి ఓ పెద్దాయన ఇంటికి వస్తే ఆయన ముందు కాళ్ళు జాపుకుని తాపీగా కూర్చున్నారట. ఆ పెద్దాయన వెళ్లేంత వరకు కృష్ణం రాజు అలానే కుర్చున్నారట. దాంతో కృష్ణంరాజు నాన్నగారు కొరడాను తెప్పించి మరీ .. చితక్కొట్టి అసలు సంగతి చెప్పారట. ఇంటికి ఎవరు వచ్చినా ముందు అతిథి మర్యాదలు చేయాలి. నువ్వు ఏపనిలో ఉన్నా ఇంటికివచ్చిన వారిని ముందు గౌరవించాలి అని ఆయన తండ్రి గారు చెప్పారట. అప్పటి నుండీ కృష్ణంరాజు.. ఇంటికి ఎవరొచ్చినా మర్యాదలు చేస్తూనే ఉంటారట. అలా కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ కూడా ఆ దారిలోనే వెళుతున్నారు.
కృష్ణంరాజు.. విజయనగర సామ్రాజ్య వారసులు. అందుకే వారి పేరు వెనకాలు `రాజు`అనేది ఉంటుంది. వీరికి అనేక ఆస్తులున్నాయి. వేల ఎకరాల భూములున్నాయి. అయినా నటన అంటే పిచ్చి కృష్ణంరాజుకి. మొదటగా ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. సినిమా రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు ఎలాంటివో తెలిసిందే. వ్యక్తిగత విషయానికి వస్తే, కృష్ణం రాజుకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. యంగ్ ఏజ్‌లోనే సీతాదేవితో వివాహం జరిగింది. ఆమె వారి బంధువుల అమ్మాయి కావడం విశేషం. ఆమెకి పిల్లలు లేరు. దీంతో ప్రశాంతి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకి చాలా కాలం క్రిందటే పెళ్లి అయ్యింది. వారు సినిమాలకు దూరంగా ప్రైవేట్ లైఫ్‌ని గడుపుతున్నారు. వీరికో పాప కూడా ఉన్నట్టు సమచారం. సీతాదేవి మరణం తర్వాత శ్యామలా దేవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.