Bala Ramayanam : బాల రామాయణం సీతమ్మ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!
ప్రధానాంశాలు:
Bala Ramayanam : బాల రామాయణం సీతమ్మ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!
Bala Ramayanam : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాకముందే, బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ‘బాల రామాయణం’ అనే పౌరాణిక సినిమాతో ఎన్టీఆర్ రాముడిగా నటించి విశేషంగా మెప్పించారు సినిమా మొత్తం చిన్న పిల్లలతో తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది కూడా.

Bala Ramayanam : బాల రామాయణం సీతమ్మ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!
Bala Ramayanam అదరహో..
ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన చిన్నారి ఎవరో తెలుసా? ఆమె పేరు స్మిత మాధవ్. అప్పట్లో చిన్నారిగా అలరించిన స్మిత ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ గాయని, భరతనాట్యం నర్తకిగా తన ప్రత్యేకతను చాటుతున్నారు. స్మిత మాధవ్ భరతనాట్యంను ప్రముఖ నాట్యాచార్యులు శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ శిష్యురాలిగా నేర్చుకున్నారు.
ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సంగీతం, నృత్యంలో డిప్లొమా పూర్తి చేయగా, ఇందిరకళ సంగీత విశ్వవిద్యాలయం నుంచి నృత్యంలో, మద్రాస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. ‘బాల రామాయణం’ తర్వాత ఆమె ఆర్ట్ ఫిల్మ్ ‘పృథ్విస లో కథానాయికగా నటించారు. స్మిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ కాకపోయినా, అడపాదడపా తన డాన్స్ పర్ఫార్మెన్స్‌లు, సంగీత వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిన్ననాటి సీత, ఇప్పుడు కళాసాధనతో ఆకట్టుకుంటున్న నాట్య కిరణంగా మారారు.
View this post on Instagram