Tiktok Bhanu : వారిద్దరిని చూసి ఎమోషనల్.. భోరున ఏడ్చిన టిక్ టాక్ భాను.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tiktok Bhanu : వారిద్దరిని చూసి ఎమోషనల్.. భోరున ఏడ్చిన టిక్ టాక్ భాను.. వీడియో..!

 Authored By bkalyan | The Telugu News | Updated on :16 August 2021,8:00 pm

Tiktok Bhanu బుల్లితెరపై ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా స్పెషల్ డే ఉన్నా, పండుగ ఉన్నా కూడా వాటిని ఇట్టే పట్టుకుంటున్నారు. ఈవెంట్లు చేస్తున్నారు. వచ్చే ఆదివారం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. అంతే కాకుండా రాఖీ పండుగ కూడా. అయితే ఈ రెండింటితో వచ్చే ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీ దుమ్ములేపేందుకు రెడీగా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Tiktok Bhanu Gets Emotional In Sridevi Drama Company

Tiktok Bhanu Gets Emotional In Sridevi Drama Company

భోరున ఏడ్చిన టిక్ టాక్ భాను Tiktok Bhanu

చిరు బర్త్ డే సందర్బంగా అందరూ కూడా స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేశారు. చిరు స్టైల్లో స్టెప్పులు ఆయన పాటలకు స్టెప్పులు వేశారు. సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, ఇమాన్యుయేల్ ఇలా అందరూ చిరు ఐకానిక్ మూమెంట్స్ వేశారు. ఇక రాఖీ స్పెషల్‌గా జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల అక్కా, చెల్లెళ్లను పిలిపించారు. ఇందులో రవికృష్ణ, శివజ్యోతిలు కూడా వచ్చారు.

Tiktok Bhanu Gets Emotional In Sridevi Drama Company

Tiktok Bhanu Gets Emotional In Sridevi Drama Company

బిగ్ బాస్ షో నుంచి రవికృష్ణ, శివజ్యోతిలు సొంత అక్కాతమ్ముడిలానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ అన్నాచెల్లి స్కిట్ వేశారు. ఎంతో అపురూపంగా పెంచుకున్న చెల్లిని భర్త హింసిస్తాడు. చివరకు అన్న చేతిలో బిడ్డ పెట్టి చెల్లి చనిపోతోంది. ఈ స్కిట్ చూసి టిక్ టాక్ భాను తెగ ఏడ్చేసింది. నాకు మా అన్న గుర్తుకు వస్తున్నాడు.. ఆ ఇద్దరిని అలా చూస్తుంటే.. ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయా.. ఏడుపు ఆగడం లేదంటూ కన్నీరు పెట్టేసుకుంది.

YouTube video

ఇది కూడా చ‌ద‌వండి ==> నీకు అది ఉందని ఫీలవుతున్నా.. రాంప్రసాద్‌పై యాంకర్ విష్ణుప్రియ కొంటె కామెంట్లు!!

ఇది కూడా చ‌ద‌వండి ==> ద్రాక్ష పళ్ళ కళ్ళతో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్.. నవతరం అందాల తార అంటున్నఫ్యాన్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్!

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది