TikTok Bhanu : టిక్ టాక్ భాను రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

Authored By aruna | The Telugu News | Published on: August 2, 2022, 12:20 pm

TikTok Bhanu : తెలుగు ప్రేక్షకులతో భాను అంటే టక్కున గుర్తు రాక పోవచ్చు కానీ టిక్ టాక్ భాను.. జబర్దస్త్‌ భాను అంటే అందరూ గుర్తిస్తారు. ఈ మధ్య ఈ అమ్మాయి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈమె ఇన్ స్టా లో చేసే రీల్స్ తో పాటు యూట్యూబ్ లో వీడియోలతో తెగ పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈమె జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈమెని హైపర్ ఆది జబర్దస్త్ కి పరిచయం చేశాడు. అప్పటినుండి కూడా ఈ అమ్మడు దూసుకుపోతూనే ఉంది. సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం శ్రీదేవి కంపెనీలో వరుస ఎపిసోడుల్లో కనిపిస్తుంది.

హాట్‌ డాన్స్ లతో పాటు అదిరిపోయే స్కిన్‌ షో చేస్తూ వరుసగా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడి డిమాండ్ బాగా పెరిగింది. వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడంతో పాటు సోషల్ మీడియా లో ఈ అమ్మాయికి ఏకంగా 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇదే సమయంలో ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ లో కనిపిస్తున్నందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటుందట. అది ఎంత అనే ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఒక్క రోజు కాల్షీట్ కి ఒక లక్ష 25 వేల రూపాయలను మల్లెమాల వారు పారితోషికంగా ఇస్తున్నారని తెలిస్తోంది.

TikTok Bhanu remuneration for sridevi drama company and jabardasth

TikTok Bhanu remuneration for sridevi drama company and jabardasth

నటిగా ఈమె వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నా కూడా బుల్లి తెర కే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. హీరోయిన్గా వెళ్తే బుల్లి తెరపై అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు హీరోయిన్గా సక్సెస్ కాకుంటే మళ్ళీ బుల్లి తెరపై చేసే అవకాశం తక్కువ. కనుక సినిమా ల్లో గట్టిగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. ఈమె కామెడీ మరి డాన్స్ లతో మంచి డిమాండ్ ఉంది కనుక ముందు ముందు ఈమె కి భారీగా రెమ్యూనరేషన్‌పెరిగే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp