Tiktok Bhanu : ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసింది.. టిక్ టాక్ భాను లవ్ స్టోరీ ఇదే
Tiktok Bhanu : టిక్ టాక్ ద్వారా ఎంత మంది వెలుగులోకి వచ్చారో అందరికీ తెలిసిందే. టిక్ టాక్ వల్ల ఎంతో మంది లాభపడ్డారు. అయితే జనాల నెత్తి మీద కొంత మంది వచ్చి పడ్డారు. వాళ్ల చేష్టలు చూడలేక తలపట్టుకునే వారు. తేడా బ్యాచ్ అంతా కూడా ఒక్క చోటకు చేరుకున్నట్టు అయింది. అయితే ఈ టిక్ టాక్ వల్ల సినిమా స్టార్లు అయిన వాళ్లు కూడా ఉన్నారు. టిక్ టాక్‌లో నటించడం, డ్యాన్సులు చేయడం వంటివి చేస్తూ సినిమా ఆఫర్లు పట్టుకున్నవారున్నారు. ఇక కొంత మంది బుల్లితెరపై సెటిల్ అయ్యారు. ఇంకొందరు వెండితెరపై సెటిల్ అయిన వారున్నారు.
తెలుగులో అయితే బుల్లితెరపై టిక్ టాక్ భాను ఎక్కువగా ఫేమస్ అయింది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో భాను సందడి చేస్తుంటుంది. చైనీస్ పిల్ల అంటూ ఆమెను ట్రోల్స్ చేస్తుంటారు. మధ్యలో ఈ షోలకు గ్యాప్ ఇచ్చింది భాను. లండన్ వెళ్లి వచ్చాను అంటూ బిల్డప్ ఇస్తుండేది. దీంతో అందరూ లండన్ భాను అని ఎగతాళి చేస్తుండేవారు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను వదిలారు. అమ్మనా కోడలా అంటూ అత్తాకోడళ్ల నేపథ్యంతో ఈ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఈప్రోమోలో కార్తీక దీపం భాగ్యం ఎమోషనల్ అయింది.
తన పరిస్థితి, తన కూతుళ్ల గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్ చేసింది. ఆ తరువాత మనసులో ఇంత వరకు ఎవ్వరికీ చెప్పనిది.. చెప్పుకునే ఛాన్స్ అంటూ రష్మీ ఓ రౌండ్ పెట్టినట్టుంది. ఇందులో వర్ష, భానులు ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. తమ తమ వ్యక్తి గత జీవితాల గురించి చెప్పేశారు. గత ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తిని ఇష్టపడుతోందట.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు కూడా తెలీదంటూ తెగ సిగ్గు పడిపోయింది టిక్ టాక్ భాను. మరి అతగాడు ఎవరో తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అతగాడిని నేరుగా స్టేజ్ మీదకు తీసుకొస్తుందేమో చూడాలి.
