Tollywood : పది రోజుల్లో గుడ్‌న్యూస్ వింటాం… స్టన్నింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోలు
Tollywood: టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు సినిమా టిక్కెట్ వ్యవహారంతో పాటు పలు విషయాలపై ఏపీ సీఎం జగన్‌తో చర్చించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘విశాను సినిమా హబ్‌గా తయారు చేస్తామన్నారు. . ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది.
సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.సీఎంతో భేటి తర్వాత పలువురు ప్రముఖులు పది రోజులలో గుడ్ న్యూస్ వింటాం అనే ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంతో భేటీ పూర్తయ్యాక రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ ఓపికగా విన్నారు. సినిమా వాల్ల కష్టాల గురించి ముఖ్యమంత్రి గారికి చాలా అవగాహన ఉంది. ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ అతని చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చాటిచెప్పారు. ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేశారు.
Tollywood : సమస్యలకు ఫలితం లభించిందా..
చిరంజీవి ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళుతున్నందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.ప్రతీ థియేటర్‌లో ఉదయం 8 నుంచి మొదలై.. రోజంతా 5షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లూ తెగకుండా, ముడిపడకుండా ఉన్న టికెట్ రేట్లపైనా ఓ సానుకూల చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 5రూపాయలు టికెట్ ఉన్న నాన్‌ఏసీ థియేటర్‌లో ఇకపై మినిమమ్ 30 రూపాయలు, అత్యధికంగా 70 రూపాయలు ఉండేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా,కార్పొరేషన్ అయినా.. మినిమమ్ టికెట్ రేట్ 40, మ్యాగ్జిమమ్ 150 రూపాయల వరకూ ఆస్కారం ఉండబోతోంది.