Jahnvi Kapoor : హీరోయిన్స్ విలేజ్ సెంటిమెంట్ మీద పడ్డ దర్శకులు.. ఇప్పుడు దేవర మూవీలో కూడా..!
ప్రధానాంశాలు:
హీరోయిన్స్ విలేజ్ సెంటిమెంట్ కే సై అంటున్న డైరెక్టర్స్
దేవర మూవీలో విలేజ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
జాన్వీ కపూర్ విలీజ్ గర్ల్ గా మెప్పిస్తుందా?
Jahnvi Kapoor : అది ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరోయిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. గ్లామర్, పొట్టి పొట్టి డ్రెస్సులు, బికినీలు, ఫ్యాషన్ గా ఉండే డ్రెస్సులు, క్లీవేజ్ షోలు.. ఇలా ఊహించుకుంటాం మనం. నిజానికి.. హీరోయిన్లు కాస్తో కూస్తో చూపిస్తేనే సినిమాకు వెళ్తున్నారు ప్రేక్షకులు. పైనో, కిందో, లేదంటే నడుము, బొడ్డు.. ఇలా ఏదో ఒకటి చూపిస్తేనే కదా హీరోయిన్లకు కూడా క్రేజ్ వచ్చేది. ఈరోజుల్లో చూపించకపోతే అవకాశాలు రావు. మామూలుగా కాదు.. ఎంత చూపిస్తే అన్ని అవకాశాలు.. అది స్టార్ హీరోయిన్ అయినా.. మామూలు హీరోయిన్ అయినా చూపించడం, రొమాన్స్ చేయడం అనేది కామన్. కనీసం లిప్ కిస్ అయినా ఇవ్వాలి హీరోకు. లేకపోతే సినిమాల్లో అంత దమ్ము ఉండదు. హీరోయిన్స్ ను దాదాపుగా గ్లామర్ కోసమే కొందరు డైరెక్టర్లు తీసుకుంటూ ఉంటారు. కానీ.. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే కాదు.. ఏదో రొమాన్స్ కోసం మాత్రమే కాదు.. వాళ్లలోనే నటించే సత్తా ఉంది. వాళ్లు కూడా హీరోతో సమానంగా నటించగలరు అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. నిజానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడీ ఈ మధ్యన వస్తున్నాయి. ఇక.. తెలుగులో తీసుకుంటే.. హీరోయిన్ అంటే అలాగే ఉండాలి.. ఇలాగే ఉండాలి.. గ్లామర్ గా మాత్రమే కనిపించాలి అనే మూస ధోరణికి పుల్ స్టాప్ పెట్టగలిగిన దర్శకుడు సుకుమార్ అనే చెప్పుకోవాలి.
రంగస్థలం సినిమాలో ఒక సమంత క్యారెక్టర్ తీసుకుంటే అద చాలా డీగ్లామర్ రోల్. అసలు అలాంటి క్యారెక్టర్ చేయాడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోదు. ఆ సమయంలో సమంత స్టార్ హీరోయిన్. అయినా కూడా ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేయడానికి, డీగ్లామర్ రోల్ చేయడానికి సమంత ఒప్పుకొని పెద్ద సాహసం చేసిందనే చెప్పుకోవాలి. తన సాహసానికి మంచి ప్రశంసలే లభించాయి. దీంతో ఆ తర్వాత పుష్ప సినిమాకు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడు సుకుమార్. ఆ సినిమాలోనూ హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న పాత్ర డీగ్లామర్ రోల్ లోనే ఉంటుంది. మళ్లీ ఆ ఫార్మాట్ సూపర్ హిట్ అయింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఎంత ప్రాధాన్యత ఉందో.. శ్రీవల్లికి కూడా అంతే పాత్ర ఉంది. తనకు కూడా అంతే పేరు వచ్చింది. ఇలా.. సుకుమార్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ను సెట్ చేయడంతో మిగితా దర్శకులు కూడా ఈ ఫార్మాట్ బాగుందని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు.
Jahnvi Kapoor : విలేజ్ సెంటిమెంట్ కి సై అంటున్న టాలీవుడ్ దర్శకులు
అందుకే.. టాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ల విషయంలో విలేజ్ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాలోనూ ఇదే సెంటిమెంట్ ను వాడుతున్నారట కొరటాల. కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటాయి. ఆయన సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఆయన కూడా ఓటమి ఎరుగని డైరెక్టరే కానీ.. ఇటీవల ఆచార్య సినిమా ఒక్కటే తనకు మైనస్ అయింది. ఆచార్య ప్లాఫ్ అయినా రెట్టించిన ఉత్సాహంతో మంచి కథ రెడీ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా తీస్తున్నాడు కొరటాల. ఆ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నటనలో తన తల్లి శ్రీదేవిని మించిపోయింది. అందులోనూ జాన్వీకి ఇది తెలుగులో తొలి మూవీ. ఈ సినిమాలో కూడా విలేజ్ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు కొరటాల. ఈ సినిమాలో జాన్వీ ఒక విలేజ్ అమ్మాయిగా కనిపించబోతోంది. అంటే.. పూర్తిగా ఇది కూడా డీగ్లామర్ రోల్ అన్నమాట. ఏమాత్రం భయపడకుండా హీరోయిన్లు కూడా డీగ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పేస్తున్నారు. ఎలాంటి మేకప్ లేకుండా.. విలేజ్ అమ్మాయిగా భలేగా నటిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. చూడాలి మరి విలేజ్ అమ్మాయిగా జాన్వీ ఏ మేరకు ఒప్పిస్తుందో?