Home » Entertainment » Tollywood Heroes Doing Movies Very Slow
Entertainment

Tollywood : మన హీరోలు మరీ ఇంత బద్దకంగా తయారయ్యారేంటీ.. వాళ్లనైనా చూసి నేర్చుకోవాలి

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2022, 9:40 pm
Advertisement

Tollywood : ఒకప్పుడు మన తెలుగు హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు హీరోలు అయితే ఏకంగా పది సినిమాలు కూడా సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం హీరోలు ఏడాది కి ఒకే ఒక్క సినిమా.. దానికి కూడా కిందా మీదా పడుతున్నారు. కొందరు హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా విడుదల చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేశామని కాదు, ఎన్ని సక్సెస్ లు పొందాం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ తరం యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేయకుండా మెల్లగా సినిమాలు చేస్తూ ఉన్నారు.

Advertisement

సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు అవసరం లేదు.. కానీ ఒక దాని వెనక ఒకటి సినిమా చేయాలని అభిమానులు అభిమతం. తమిళ హీరోలు ఉదాహరణకు విజయ్‌ ని తీసుకుంటే వరుసగా సినిమాలు చేస్తూ ఉంటాడు. సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయన తదుపరి సినిమా వెంటనే ప్రారంభమవుతుంది. కానీ మన తెలుగు హీరోలు మాత్రం నత్త నడకన అన్నట్లుగా చాలా స్లో గా సినిమాలు చేస్తూ సినిమాకు సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

Tollywood heroes doing movies very slow

Advertisement

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విడుదల అయి చాలా నెలలు అవుతూనే ఉంది, అయినా కూడా ఇప్పటి వరకు తదుపరి సినిమా చేయలేదు. ఎన్టీఆర్ సినిమా విషయం లో కూడా అంతే. ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా ప్రారంభం కాలేదు. ఇక అల్లు అర్జున్ సినిమా వచ్చి చాలా నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు తదుపరి సినిమా కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు. మన హీరోలు బద్ధకంగా ఉండి వరుసగా సినిమాలు చేయడం లేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసే విషయం లో తమిళ హీరోలని ఫాలో అవ్వడం మంచిదని, వారిని చూసి నేర్చుకోవాలని మన స్టార్ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి