Tollywood : బిగ్ షాక్.. రేప‌టి నుండి సినిమా షూటింగ్స్ బంద్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tollywood : బిగ్ షాక్.. రేప‌టి నుండి సినిమా షూటింగ్స్ బంద్..!

Tollywood : టాలీవుడ్‌లో స‌మ్మె సైర‌న్ మోగ‌నుందా అంటే అవున‌నే అనిపిస్తుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో గతకొన్ని ఏళ్లుగా సినీ కార్మికుల వేతనాలు పెంచపోవడంతో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు హాజరు రాకూడదని నిర్చయించుకున్నట్లు తెలుస్తోంది. 24 యూనియన్ సభ్యులు ఈ నెల 22న ఫెడరేషన్ ముట్టడి చేయుచున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ లు జరగవని సినీ కార్మికులు అంటున్నారు. ఫిలిం ఫెడరేషన్‌లోని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 June 2022,6:30 pm

Tollywood : టాలీవుడ్‌లో స‌మ్మె సైర‌న్ మోగ‌నుందా అంటే అవున‌నే అనిపిస్తుంది.తెలుగు చిత్ర పరిశ్రమలో గతకొన్ని ఏళ్లుగా సినీ కార్మికుల వేతనాలు పెంచపోవడంతో కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు హాజరు రాకూడదని నిర్చయించుకున్నట్లు తెలుస్తోంది. 24 యూనియన్ సభ్యులు ఈ నెల 22న ఫెడరేషన్ ముట్టడి చేయుచున్నారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ లు జరగవని సినీ కార్మికులు అంటున్నారు. ఫిలిం ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది.

ఇప్పటికైనా తమ గోడును సినీ పెద్దలు వినిపించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తక్షణమే తమ వేతనాలు పెంచి, తమను ఆదుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాత మండలి సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పందించడం లేదని.. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘ నాయకులతో చర్చిస్తున్నామని.. రేపటి నుండి షూటింగ్‌ల నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రతి రెండేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. మరి సినీ కార్మికుల డిమాండ్‌కు నిర్మాత మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఒకవేళ వారి దగ్గర్నుండి సరైన సమాధానం రాకపోతే, సమ్మె సైరెన్ మోగడం తథ్యం అని అంటున్నారు సినీ కార్మికులు.

Tollywood Movies shootings cancelled from tomorrow

Tollywood Movies shootings cancelled from tomorrow

Tollywood : స‌మ్మె సైర‌న్..

గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇపుడిపుడే ఇండస్ట్రీ కోలుకుంటోంది. మరోవైపు సినిమాల్లో హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు .. అందులో పనిచేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు తగివ వేతనాన్ని ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఇంటా బయటా అన్నింటా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దానికి తగ్గట్టు జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచమంటూ నిర్మాతల మండలిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా స‌మ్మెకు దిగాల‌ని డిసైడ్ అయింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది