Tollywood : సెలబ్స్ వరుసగా కరోనా బారిన పడడం వెనక కారణం ఏంటో తెలుసా?
Tollywood : కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం ఏర్పడింది. ఒకవైపు ఫైనాన్షియల్‌గా చాలా మంది నష్టపోగా, మరోవైపు లెజండరీ నటులు కన్నుమూసారు. ఈ నష్టం ఎవరు పూడ్చలేనిది. అయితే గత రెండు వేవ్‌లో ఎప్పుడు లేనంతగా ఈ సారి సెలబ్స్ కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది సెలబ్స్ కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ లో స్వర భాస్కర్, విశాల్ దద్లాని, జాన్ అబ్రహం, ఏక్తా కపూర్, రియా కపూర్ నోరా ఫతేహీ, అర్జున్ రామ్ పాల్, శిల్పా శిరోద్కర్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు.
సౌత్ లో కమల్ హాసన్, అర్జున్, విశ్వక్ సేన్ మహేష్ బాబు, త్రిష, సత్యరాజ్, కరీనా కపూర్, ఏక్తా కపూర్, మంచు లక్ష్మి వంటి స్టార్స్ కరోనా బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌కి కరోనా సోకింది.ఉన్నట్టుండి పరిశ్రమ అగ్ర హీరోలు సహా పలువురు నటీమణులు.. ఓ సంగీత దర్శకుడు కూడా తమకు కోవిడ్ సోకిందని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. వీరంతా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కరోనా సోకిందని చెప్పడం అందరిలోనూ అనేక సందేహాలకు దారితీసింది. నిజానికి కోవిడ్ సోకిన వారంతా హైదరాబాద్ నగర శివార్లలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రహస్యంగా నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకకు హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి.
Tollywood : న్యూ ఇయర్ వేడుకలే కారణమా?
పార్టీలో ఇష్టానుసారంగా వ్యవహారించడం, కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఇది జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీల్ని కలిసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎవరికి ఏ క్షణం ఏ ముప్పు బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నారట. రానున్న రోజులలో కోవిడ్ బారిన పడిన వారిన లిస్ట్ మరింత పెరుగుతుందని కూడా కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.