Tollywood : తెలుగు పరిశ్రమ ఏపీకి వెళ్తుందా..? .. పవన్ కళ్యాణ్ మాటలు నిజమవుతాయా..?
ప్రధానాంశాలు:
Tollywood : తెలుగు పరిశ్రమ ఏపీకి వెళ్తుందా..? .. పవన్ కళ్యాణ్ మాటలు నిజమవుతాయా..?
Tollywood : ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమ ఒక్క రాష్ట్రమే కానీ తెలంగాణా సెపరేట్ స్టేట్ అయ్యాక ఏపీ, తెలంగాణా రెండిటిలో కూడా పరిశ్రమ కొనసాగుతుంది. ఐతే ఉన్న ఒక్క టాలీవుడ్ పరిశ్రమ అటు ఏపీ, ఇటు తెలంగాణా రెండు రాష్ట్రాలను కవర్ చేస్తుంది. రెండు రాష్ట్రాల రాజకీయ షరతులు ఫాలో అవుతూ సినిమాలు తీయాలి.. రిలీజ్ చేయాలి.. ఆడించాలి. ఎవరికి ఏ నిమిషం ఎలాంటి అసంతృప్తి వచ్చినా సరే ఇండస్ట్రీ మీద ఎటాక్ తప్పనిసరి అన్నట్టు పరిస్థితి ఉంది. ఐతే ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఒక టాలీవుడ్ స్టార్ హీరోనే. ఒక సినిమా కథ దశ నుంచి రిలీజ్ వరకు యూనిట్ అంతా పడే వేదన ఏంటన్నది ఆయనకు తెలుసు. కాబట్టి చిత్ర యూనిట్ ఏపీ డిప్యూటీ సీఎం తమకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తారనే ఆశతో ఉన్నారు. అందుకు తగినట్టుగానే ఏపీకి తెలుగు చలన చిత్ర పరిశ్రమను తీసుకెళ్లాలనే ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది.
Tollywood షూటింగ్ కు కావాల్సిన సౌకర్యాలు..
ఇదివరకు సీఎం జగన్ కూడా వైజాగ్ కు పరిశ్రమ తరలించే ప్రపోజల్ చేశారు. ఐతే హైదరాబాద్ నుంచి పరిశ్రమను ఏపీకి తరలించడం అంత తేలికైన విషయం కాదు. ఐతే ఏపీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ముందు అక్కడ స్టూడియోలు గట్రా నిర్మించాలి. ఇంకా షూటింగ్ కు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏమైనా సినిమా పరిశ్రమ అక్కడకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ముఖ్యంగా విజయవాడ, వైజాగ్ కేంద్రంగా స్టూడియొలు కడితే అప్పుడు పరిశ్రమ అక్కడకు మారే అవకాశం ఉంటుంది. ఐతే ఇప్పుడు ఆ పనులు మొదలు పెట్టినా పరిశ్రమ ఏపీకి వెళ్లడానికి చాలా టైం పడుతుందని చెప్పొచ్చు. మద్రాస్ ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ కి సినీ పరిశ్రమ తీసుకొచ్చేందుకే అప్పటి స్టార్స్ ఎంతో కష్టపడ్డారు. మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్లడ కూడా చాలా కష్టమవుతుందని చెప్పొచ్చు. Tollywood will Shift to Andhra Pradesh