Ram Charan : మగధీర ను మించిన పిక్చర్ తీస్తా.. రామ్ చరణ్‌కు యంగ్ డైరెక్టర్ ఆఫర్..?
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ..మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుని టాలీవుడ్ హీరోగా సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ తర్వాత చెర్రీ పాన్ ఇండియా స్టార్ అయిపోతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఆయన లైనప్ మూవీస్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఈ సంగతులు ఇలా ఉంచితే.. తాజాగా చరణ్‌కు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ క్రేజీ ఆఫర్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటి.. ఇంతకీ ఆయన ఎవరంటే..రామ్ చరణ్ తేజ్ లైనప్ మూవీస్‌లో ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ మూవీ ‘ఆర్ సీ 15’ ఉండగా, ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో స్పోర్ట్స్ డ్రామ్ ఉంది. కాగా, ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి నెట్టింట వార్తల్ హల్ చల్ అవుతున్నాయి. ఆ వార్తల ప్రకారం..తాజాగా ‘శ్యామ్ సింగ రాయ్’ ఫిల్మ్‌తో సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. టైమ్ ట్రావెల్ కథతో ఓ సినిమా తెరకెక్కించేందుకు స్టోరీ రెడీ చేసుకున్నాడని సమాచారం.ఈ స్టోరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం రాసుకున్నాడని తెలుస్తోంది.

tollywood young director offer to ram charan
Ram Charan : టైమ్ ట్రావెల్ స్టోరితో.. జక్కన్నను మించి..గ్రాండియర్‌గా మూవీ..!
స్టోరి కంప్లీట్ అయ్యాక చరణ్‌కు వినిపించి, కన్విన్స్ చేస్తానని ఆయన అనుకుంటున్నాడట. రాజమౌళి ‘మగధీర’ మూవీని మించి ఈ పిక్చర్ ఉండబోతుందని రాహుల్ సాంకృత్యన్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట. అంతలా ఈ స్టోరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయి? ఇంతకీ స్టోరి ఎక్కడి వరకు వచ్చింది? ఇదంతా నిజమేనా? అనే విషయాలు తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. రాహుల్ సాంకృత్యన్ ప్రజెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కూడా చూసి ప్రశంసలు కురిపించడం విశేషం.