Political Leaders – Heroines : రాజకీయ నాయకులని పెళ్ళాడిన హీరోయిన్ లు వీళ్ళే !
Political Leaders – Heroines : రాజకీయ రంగానికి, సినిమా రంగానికి మధ్య ఏదో బంధం ఉంది. అందుకే.. చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు రాజకీయాల్లో రాణిస్తారు. అలాగే.. కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. రాజకీయ నాయకులను పెళ్లాడుతారు. స్టార్ హీరోయిన్లు కూడా రాజకీయ నాయకులను పెళ్లాడిన సందర్భాలను చూశాం.
నిజానికి.. పెళ్లికి ఏం రంగంతో సంబంధం లేదు. ఏం రంగంలో ఉన్న వాళ్లు అయినా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్లు కొందరు మాత్రం రాజకీయ నాయకులను పెళ్లాడారు. వాళ్లు ఎవరో తెలుసా? కన్నడ ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న రాధిక హీరోయిన్ తెలుసు కదా. సీనియర్ హీరోయిన్ రాధిక కాదండోయ్. తెలుగులో తారకరత్నతో భద్రాద్రి రాముడు సినిమా చేసింది. ఈమె ఏకంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Political Leaders – Heroines : స్వర భాస్కర్, అయేషా టకియా, నవనీత్ కౌర్, పరిణీతి చోప్రా వీళ్లంతా అదే కేటగిరి
రాజకీయ నాయకులను పెళ్లి చేసుకున్న వారిలో చాలామంది బాలీవుడ్ నుంచే ఉన్నారు. స్వర భాస్కర్ తెలుసు కదా. తను సమాజ్ వాద్ పార్టీ నేత ఫహద్ జిరార్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అయేషా టకియా తెలుసు కదా. సూపర్ సినిమాలో నటించింది. తను బాలీవుడ్ హీరోయినే. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే అబూను అయేష పెళ్లి చేసుకుంది. నవనీత్ కౌర్ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తోంది. పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఇటీవలే తన నిశ్చితార్థం కూడా అయింది. త్వరలో వాళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది.