Trivikram : ఇండ‌స్ట్రీలో ఇదే చర్చ‌.. స్టార్ హీరోకి స‌మానంగా త్రివిక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : ఇండ‌స్ట్రీలో ఇదే చర్చ‌.. స్టార్ హీరోకి స‌మానంగా త్రివిక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 March 2022,9:30 pm

Trivikram : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న త్రివిక్ర‌మ్ ఎక్కువ‌గా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర‌ర్స్‌లోనే సినిమాలు చేస్తుంటారు. ఈ రెండు బ్యాన‌ర్స్‌లో వేరే ద‌ర్శ‌కులు చేసే ప‌నిని కూడా ఈయ‌న పర్య‌వేక్షిస్తుంటార‌ని కూడా బ‌య‌ట టాక్ విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భీమ్లా నాయ‌క్ సినిమాకి త్రివిక్ర‌మ్ ప‌ని చేశారు. ఆయ‌న అందించిన మాట‌లు సినిమాని వేరే లెవ‌ల్‌లోకి తీసుకెళ్లింది.నిన్న మొన్నటి వరకు నార్మల్ రెమ్యూనరేషన్ అందుకున్న త్రివిక్ర‌మ్

..పవన్ భీంలా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సడెన్ గా తన పారితోషకాని ఢబుల్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయ‌క్ సినిమా విష‌యంలో డైరెక్టర్ గా తన పేరు స్క్రీన్ మీద లేదు అంతే..కానీ సెట్స్ లో ఆయనే డైరెక్టర్ అని అందరికి అర్ధమైపోయిందట. అంత ఇన్వాల్వ్ మెంట్ పెట్టి పని చేసి..పవన్ కు అద్దిరిపోయే హిట్ ఇచ్చాడు. భీమ్లా నాయ‌క్ సినిమా కోసం దాదాపు 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంన్న ఈయన ప్రజెంట్ మహేష్ తో చేస్తున్న సినిమాకి ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నారట.అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి త్రివిక్ర‌మ్‌కు దాదాపు పాతిక కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా ద‌క్కింద‌ని టాక్‌ అప్పట్లో హాట్ టాపిక్ గా నడించింది. కాగా..

trivikram remuneration main topic now

trivikram remuneration main topic now

Trivikram : త్రివిక్ర‌మ్ మానియా మాములుగా లేదుగా..

ఇప్పుడు మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాకు గురూజీకి ఏకంగా యాబై కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. . ఇదే క‌నుక నిజ‌మైతే రాజ‌మౌళి త‌ర్వాత ఆ రేంజ్‌లో భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న వారిలో త్రివిక్ర‌మ్ రెండో స్థానంలో నిలుస్తారు. ప్ర‌స్తుతం మ‌హేష్ ‘స‌ర్కారు వారి పాట‌’ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తవగానే, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది