Guntur Kaaram Movie : గుంటూరు కారం మూవీ పబ్లిక్ టాక్.. సీరియల్ లాగా ఉంది … పెద్ద వేస్ట్ సినిమా..!
ప్రధానాంశాలు:
Guntur Kaaram Movie : గుంటూరు కారం మూవీ పబ్లిక్ టాక్.. సీరియల్ లాగా ఉంది ... పెద్ద వేస్ట్ సినిమా..!
Guntur Kaaram Movie : గుంటూరు కారం మూవీ రివ్యూ సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ Trivikram Srinivas కాంబినేషన్లో తెరకెక్కిన ‘ గుంటూరు కారం ‘ మూవీ Guntur Kaaram Movie Review భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మహేష్ బాబుని మాస్ స్టైల్ లో ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్ ఆయనతో ఎలాంటి కామెడీ డైలాగ్స్ చెప్పించారు అనే ఆత్రుత మహేష్ అభిమానుల్లోనే కాదు త్రివిక్రమ్ సినిమాలను ఇష్టపడే అందరిలోనూ ఉంది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ సినిమాను నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ జయరాం కీలక పాత్రలు పోషించారు. ముందుగా ఓవర్సీస్ లో గుంటూరు కారం ప్రీమియర్స్ పూర్తయ్యాయి. అంతేకాకుండా హైదరాబాదు లాంటి పలు నగరాల్లో గుంటూరు కారం బెనిఫిట్ షోస్ పూర్తి అయ్యాయి.
ఇక సినిమా చూసిన పబ్లిక్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామని, కానీ ఆ స్థాయిలో సినిమా లేదని అంటున్నారు. సినిమా మొత్తం సీరియల్ లాగా కొనసాగిందని, అలవైకుంఠపురం లాంటి కొన్ని సినిమాలను మిక్స్ చేసి గుంటూరు కారం సినిమా చేసినట్టుగా ఉందని పబ్లిక్ చెబుతున్నారు. మొత్తానికి సినిమా యావరేజ్ గా ఉందని పబ్లిక్ టాక్. కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసం సినిమాని చూడవచ్చు అని, ఈ సినిమా కంటే హనుమాన్ సినిమా బెటర్ గా ఉందని అంటున్నారు. మహేష్ బాబు కాబట్టి సినిమా కలెక్షన్ పరంగా దూసుకెళ్తోంది కానీ సినిమా అస్సలు బాగోలేదని అంటున్నారు.
శ్రీ లీల డాన్స్ తో అదరగొట్టేశారు. హనుమాన్ సినిమా గుంటూరు కంటే 100% బెటర్ గా ఉందని పబ్లిక్ చెబుతున్నారు. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు దక్కిన సినిమా టాక్ తో అయినా దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తారు అని పబ్లిక్ చెబుతున్నారు. శ్రీ లీల తన డాన్స్ తో అదరగొట్టిందని చెబుతున్నారు. మహేష్ బాబుని కొత్తగా చూపించినా, అది వర్క్ అవుట్ కాలేదని, సినిమా మొత్తం సీరియల్ లాగా చాలా స్లోగా నడిచిందని చెబుతున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గుంటూరు కారం అభిమానులను నిరాశపరిచింది. మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్ కరెక్ట్ గా లేదని, మొత్తానికి గుంటూరు కారం సినిమా నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీనికంటే హనుమాన్ సినిమా చాలా బెటర్ గా ఉందని పబ్లిక్ చెప్పుకొస్తున్నారు.